Sita Ramam : సీతారామం ఓటీపీ రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే.!?

Sita Ramam : దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించిన చిత్రం సీతారామం.. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ చిత్రాన్ని హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు.. ఈ సినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఓటిటి రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది..

ఈ సినిమా విడుదలైన 32 రోజులకు గాను తెలుగులో 22 కోట్ల 86 లక్షల షేర్ వసూలు చేస్తే 40 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూలు చేసింది.. ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల 34 లక్షల షేర్ వసూలు చేస్తే 86 కోట్ల 90 లక్షల గ్రాస్ ను వసూలు చేసింది.. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా మలయాళం లో కూడా మంచి కలెక్షన్లను వసూలు చేసింది.. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తుండగా.. హిందీ లో కూడా విడుదల చేయగా అక్కడి కూడా ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించింది.

Sita Ramam ott Release date out
Sita Ramam ott Release date out

ఇక ఈ సినిమా ధియేటర్ మరి కొద్ది రోజులలో పూర్తిగా వస్తుంది.. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ కు సీతారామం సిద్ధమైంది.. ఈనెల 9 నుంచి సీతారామం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.. సీతారామం ఓటీటీలో ఎన్ని రకాల వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.. సీతారామం సినిమాలో రష్మిక మందన, సుమంత్ కీలక పాత్రలలో నటించారు..

Advertisement