Singer Sunitha : హీరోయిన్ గా అవకాశం ? ఒకే సమాధానం ఇచ్చిన సింగర్ సునీత .. హీరో ఎవరో ఊహించలేరు మీరు !

Singer Sunitha : సినీ ఇండస్ట్రీలో ఉండే 24 ఫ్రేమ్స్ లో..చాలా మంది ఏ విభాగంలో టాలెంట్ ఉంటే ఆ విభాగంలో దూసుకుపోతూ ఉంటారు. ప్రొడక్షన్ విభాగం లేదా డైరెక్షన్ విభాగం , సింగర్స్ , యాక్టర్స్ ఇలా ఎవరైనా సరే తమ విభాగాలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత సినిమాలలో నటించే అవకాశం వస్తూ ఉంటుంది. అయితే కొంతమంది నటన పైన ఇష్టంతో సినిమాలలో నటిస్తే.. మరికొంతమంది సున్నితంగా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో సింగర్ సునీత కూడా ఒకరు. దాదాపుగా కొన్ని సంవత్సరాలపాటు సినీ నటీనటులకు ఆత్మీయ స్నేహితురాలిగా ఎంతో మందితో అనుబంధాన్ని పెంచుకున్న సింగర్ సునీత తన పాటలతో ఎంతోమంది సినీ ప్రేక్షకుల హృదయాలను కూడా సొంతం చేసుకుంది.

గత కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతున్న ఈమె సుమారుగా 3,500కు పైగా సినిమా పాటలు పాడి.. తన గాత్రంతో శ్రోతలను మెప్పించింది. అంతేకాదు 500కు పైగా సినిమాలలో 121 మంది హీరోయిన్లకు పైగా వాయిస్ డబ్బింగ్ అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు సింగర్ గా, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు అందానికే మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న సునీత సినిమాలలో నటిస్తే చూడాలని ఆమె అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందం, అభినయం, చూడ చక్కని మోముతో చీరకట్టుకే వన్నె తీసుకొచ్చే సునీతను సినిమాలలో హీరోయిన్గా చేయాలి అని ఇటీవల ఒక మలయాళం సినీ దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా కోసం నటీనటులను తీసుకోవాలనే ప్రయత్నంలో సింగర్ సునీతను దర్శకులు కలవడం జరిగింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ ఒక సింగర్..

Singer Sunitha who answered the possibility of being the heroine
Singer Sunitha who answered the possibility of being the heroine

సబ్జెక్టు ఓరియంటెడ్ కాబట్టి ఒక మంచి సింగర్ ను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతోనే సునితను వెళ్లి కలిశారు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ నటించబోతున్నారు. నిజానికి సునీతకు సినిమాలలో నటించడం ఇష్టం లేదా అనే విషయానికొస్తే.. ఆమె సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు సింగర్ గా ,మరొకవైపు గృహిణిగా, ఇంకొక వైపు భార్యగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ బిజీగా ఉన్న సమయంలో సినిమాలలోకి వెళ్లడం మంచిది కాదనుకున్న సునీత ఈ అద్భుతమైన ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక సినిమాలలోకి వెళ్తే అక్కడ సమయాన్ని కేటాయిస్తానో.. లేదో.. అన్న ఆలోచనతోనే సునీత రిజెక్ట్ చేసారు.ఇక ఆమె ముందు ఆలోచనకు ప్రతి ఒక్కరు ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.