Singer Sunitha : సింగర్ సునీత.. ఏమని చెప్పాలి.. ఈమె అందం గురించి ఈమె అందాన్ని వర్ణించడానికి కవులకు సైతం పదాలు దొరకవు.. నెలవంకలా చూడడానికి చక్కగా కనిపించే ఈమె .. నెలవంకలో అయినా మచ్చ ఉంటుందేమో కానీ సునీత అందం లో ఎటువంటి మచ్చ లేదని చెప్పడంలో సందేహం లేదు. అంతలా తన అందచందాలతో ప్రేక్షకులను మురిపిస్తూ మైమరిపిస్తోంది సునీత. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సునీత. తన పాటలతో మాటలతో కోయిలమ్మను తలపించే ఈ ముద్దుగుమ్మకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే . ఒకసారి గళం విప్పి పాట పాడడం మొదలుపెట్టిందంటే చాలు.. ఎటువంటి వారైనా ఇట్టే మైమరచిపోతారు.

అంతలా తన అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సునీత అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే. నిజంగా ప్రేక్షకులను అలరించడానికి దేవుడు సునీతను సృష్టించాడేమో అన్నట్టుగా ఉంటుంది.. వివాహం అనంతరం ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఒక రీల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఇది చూసిన అభిమానులు మత్తుతో నేలకొరుగుతున్నారు..
తాజాగా రామ గ్రీన్ కలర్ సారీ , ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లౌజ్ ధరించి.. మెడలో ముత్యాల హారంతో..చేతిలో రెండు గులాబీలను పట్టుకొని వయ్యారంగా సత్యభామలా నడుచుకుంటూ వస్తుంటే.. ఈమె నడక చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు ప్రతి ఒక్కరిని మరింతగా మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఏదేమైనా సునీత షేర్ చేసిన ఈ రీల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా దీనిపై చాలామంది నెటిజన్లు రకరకాలుగా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కొంతమంది దేవకన్యలా ఉందంటే.. మరికొంతమంది సాగరహంసలా ఉంది అంటూ రకరకాలుగా ఈమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram