Singer Sunitha : పిల్లలతో తననే మైమరిచిపోతున్న సింగర్ సునీత.. ఫొటోస్ వైరల్..!

Singer Sunitha: సింగర్ సునీత ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి గొప్ప సంగీత కళాకారులతో కలిసి పనిచేసిన ఈమెకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఈమె తన స్వరంతో ఎంతో అద్భుతంగా పాడి మరెన్నో మధురమైన పాటలను మనకు అందించింది. ముఖ్యంగా గులాబీ చిత్రం ద్వారా ఈ వేళలో నీవు అనే పాటతో తన స్వరాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక సింగర్ సునీత కేవలం సింగర్ మాత్రమే కాదు గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.. తమన్నా, శ్రియా లాంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు గాత్ర దానం చేసింది.

Singer Sunitha is mesmerizing herself with children.. Photos are viral
Singer Sunitha is mesmerizing herself with children.. Photos are viral

ఇకపోతే ఎవరికి ఆఫర్స్ వచ్చినా రాకపోయినా సింగర్ సునీత మాత్రం పాటలు పాడడంలో బిజీగానే ఉంటుంది. ఇక కాస్త సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు అలాగే పల్లె ప్రాంతాలను ఎక్కువగా సందర్శించడానికి ఇష్టపడుతుంది. ఇకపోతే పల్లె ప్రాంతాలలో ఉండే ఎన్నో సాంప్రదాయాలను పాటించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది సింగర్ సునీత. ముఖ్యంగా పిల్లలతో గడపడానికి తన సమయాన్ని కేటాయిస్తుందని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే తాజాగా అయినా బాల భారతి గర్ల్స్ హై స్కూల్ కు ముఖ్యఅతిథిగా వచ్చినట్లు సమాచారం.

స్కూల్ ప్రాంగణంలోకి రాగానే అక్కడ విద్యార్థినిలు అంతా ఆమెకు పూలతో పాదాభిషేకం చేశారు. దారి పొడవున ఆమె పాదాలపై పువ్వులను వేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇక అక్కడ పిల్లలతో కలసి ఎంజాయ్ చేసిన సునీత ఆ పిల్లలు కూడా ఈమె పాడిన పాటలను పాడి ఆమెనే మైమరిపించారు. సింగర్ సునీత పిల్లలతో ఉన్నంతసేపు తనను తానే మైమరిచిపోయి వారిలో మమేకమైంది. అంతేకాదు ఆ పిల్లలతో గడిపిన మధురానుబూతులను ఫోటోల రూపంలో భద్రపరుచుకుంది . ఇక ఇవే ఫోటోలను, రీల్స్ ను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టా లో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇవి చూసిన నెటిజన్ లు సైతం ఫిదా అవుతున్నారు.

Advertisement