Singer sunitha : టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసి తనకంటూ ఓ ప్రత్యేక ఈ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో ముద్ర వేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా సునీత యాక్టివ్ గా ఉంటుంది.. తను చేసిన ఏ పోస్ట్ అయినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

తాజాగా సునీత తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఇకనుంచి రెండు నిమిషాలు ఉండే మ్యూజిక్ వీడియోలు పోస్ట్ చేయనున్నట్లు తెలిపింది.. నిజంగా ఇది ఆమె అభిమానులకు మంచి న్యూస్.. మీ వాయిస్ వినటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అభిమానులు పోస్టులు చేస్తున్నారు.. ఇన్స్టాగ్రామ్ లో టూ మినిట్ మ్యూజిక్ వీడియోలను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఆమె ఫ్యాన్స్ మీ పాటలు మమ్మల్ని ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి.. మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి అంటూ పోస్టులు చేస్తున్నారు..