Singer Sunitha : టాలీవుడ్ సింగర్స్ లో సునీత కూడా ఒకరు. కానీ సునీత మాత్రం స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించింది అనడంలో అతిశయోక్తి కాదు.. సునీత సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది .. అయితే తాజాగా సింగర్ సునీత ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ..

సునీత తన రెండవ పెళ్ళి చేసుకున్న సమయంలో విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. కానీ అదేమీ పట్టించుకోవడం కూడా ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది. ఇక తన భర్త ఆస్తిలో నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదట. కానీ తన భర్త సపోర్ట్ మాత్రం తీసుకుని ఓ ఆర్ఫనైజ్ రన్ చేయాలని సునీత ప్లాన్ చేస్తుందని.. ఆ ఆర్ఫనేజ్ లో ఉండే పిల్లలకు తనే స్వయంగా సంగీతం క్లాసులు కూడా చెబుతుందని సమాచారం.. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా ఆమె సహృదయానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.