Singer Sunitha : సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. సునీత ఇప్పటికే మూడు వేలకు పైగా పాటలను పాడింది… పలు స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది.. మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనితో జనవరి 9, 2021 న వీరి పెళ్లి జరిగింది.. వీరిద్దరి వివాహం తర్వాత సునీత తన కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.. ఇంతకీ తను పెళ్లి చేసుకున్న రామ్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే..

సునీత పెళ్లి చేసుకున్న రామ్ వీరపనేని బ్యాక్ గ్రౌండ్ కూడా అందరికీ తెలిసిందే. ఈయన అసలు పేరు రామకృష్ణ వీరపనేని ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. రామ్ కు పలు కంపెనీలలో వందల కోట్ల రూపాయల షేర్స్ ఉన్నాయని సమాచారం. ప్రముఖ మ్యూజిక్ సంస్థ అయినటువంటి మ్యాంగో మీడియాకి ఈయన సీఈవోగా పనిచేస్తున్నారు. మ్యాంగో మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళ, హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలను డబ్బింగ్ రైట్స్ తీసుకొని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తూ భారీగా సంపాదించారు. అలాగే తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కొన్ని వందల కోట్ల విలువ చేసేది ఉందని సమాచారం. రామ్ కూడా వందల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినట్లు టాక్. ఇక హైదరాబాదులో కూడా పలు ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని.. బిజినెస్ చేస్తూనే.. భారీగా ఆస్తులు వెనకేశారని.. మొత్తానికి
రామ్ కి వేల వందల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినట్లు సమాచారం.