Singer Sunitha: సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.. సింగర్ సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఆమె అభిమానులకు చేరుగా ఉంటుంది.. కానీ తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యంతానికి గురి చేసింది.

టాలీవుడ్ దర్శకుల్లో కళాతపస్వికే విశ్వనాథ్ శైలే వేరు. ఆయన సినిమాలకు మిగిలిన సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదు. అటువంటి దిగ్గజకుడు ఇటీవల కన్నుమూశారు. అర్ధ శతాబ్దానికి పైగా కళామతల్లి సేవలో తరించిన కే విశ్వనాథ్ తొమ్మిది పదులు దాటిన వయసులో శివైక్యం పొందరు. అయితే ఆయన మరణించారన్న వార్త తెలిసి సింగర్స్ సునీత వెంటనే ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ చేసింది.
మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. అతిధి దేవోభవ .. అంటూ తను ఆలపించిన ఓ పాట ను కే విశ్వనాధ్ ను గుర్తు చేసుకుంటూ.. మన గురువు ఆయనే అని చెబుతూ సింగర్ సునీత ఆలపించిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన నేతృత్వంలో సింగర్ సునీత ఎన్నో పాటలను ఆలపించింది. సోషల్ మీడియాలో షేర్ చేసింది.