Silk Smitha : సిల్క్ స్మిత జీవితంలో ఆసక్తికర విషయాలు.. ఏకంగా 10 మంది వెధవలతో..

Silk Smitha : సిల్క్ స్మిత ఇండియన్ మ్యాలెన్ మ్యాన్ రోల్.. కత్తిలాంటి కైపు ఎక్కించే కళ్ళు.. రస మాధుర్యాన్ని ఒలికించే పెదాలు.. అచ్చమైన నాచురల్ ఫిగర్ ఆమె సొంతం.. మూడు దశాబ్దాల పాటు కుర్రకారును కైపెక్కించారామె.. సిల్క్ స్మిత పోస్టర్ వేసుకుని ఆ రోజుల్లో లక్షల సంపాదించిన నిర్మాతలు ఎందరో. ఆ రోజుల్లో ఆమె తెరపై కనిపిస్తే మైకంలో మునిగిపోయేవారు ప్రేక్షకులు.. చదువు రాని ఆమె నటనలో కమల్ హాసన్ తో పోటీపడి ఓడించారు. రజినీకాంత్ స్పీడును సైతం అందుకని బ్రేకులు వేసింది.. మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు దీటుగా నిలబడింది.. అంతటి సిల్క్ స్మిత జీవిత కథను మరోసారి గుర్తు చేసుకుందాం..

సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి.. ఏలూరు దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో పుట్టింది. ఆమె తండ్రి రాములు, తల్లి నరసమ్మ ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ జీవితం వెల్ల తీసుకునేవారు.. సిల్క్ స్మిత ఐదో తరగతికి చదువు మానేసింది. ఆమె తల్లిదండ్రులు 14 తనకి పెళ్లి చేశారు. ఆ భర్త ఆమెను కొట్టి హింసించేవారు. ఇక అదే విషయాన్ని తన మేనత్తతో చెప్పక ఆమె తనతో పాటు చెన్నై తీసుకువెళ్ళింది . మేకప్ వేయడం నేర్పించి చిన్న చిన్న ఆర్టిస్టులకు మేకప్ వేస్తూ జీవితం మొదలు పెట్టింది విజయలక్ష్మి. ఒకరోజు నిర్మాత విను చక్రవర్తి కళ్ళల్లో పడింది. విజయలక్ష్మి పంజాబీ డ్రెస్ లో నవ్వుతూ ఆమె కనిపించడంతో.. ఈ అమ్మాయి కళ్ళల్లో ఏదో మెరుపు ఉందని పక్కనే ఉన్న తన భార్యతో చెప్పాడు. ఆమె కూడా అదే ఉందని చెప్పింది.. దాంతో ఆ అమ్మాయికి వెంటనే 5000 రూపాయలు డబ్బులు ఇచ్చి సినిమా అవకాశం ఇప్పిస్తామని చెప్పారు. విజయలక్ష్మి నేనా సినిమానా అని అడిగింది. అవునని చెప్పి ఆమెకు రెండు నెలలు యాక్టింగ్ మిగతా భాషలలో మాట్లాడే ట్రైనింగ్ ఇప్పించారు. రెండు నెలల తర్వాత స్మిత అని పేరు మార్చేసేసి సినిమా అవకాశం కూడా ఇచ్చారు.

 

వండి చక్రవర్తి అనే సినిమాతో స్మితకి బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో సిల్క్ స్మిత అనే బార్ గర్ల్ గా నటించింది. అప్పుడే సిల్క్ స్మిత అని పేరు పడిపోయింది. కాకపోతే ఇక్కడే సిల్క్ స్మిత దారి తప్పింది. ఆ తరువాత కేరళలో ఆమె చేత డీ గ్రేడింగ్ సినిమాలలో నటించారు. కానీ తనకు మాత్రం మంచి పేరే వచ్చింది. సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్స్ చేస్తూనే సినిమాలలో మంచి పాత్రలలో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి తన స్టామినా నిరూపించుకుంది. సిల్క్ స్మిత బాలీవుడ్ లో కూడా నటించింది. సిల్క్ స్మిత సుమారు 15 సంవత్సరాలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించారు. కానీ ఆమె డబ్బులు మాత్రం జాగ్రత్త చేసుకోలేకపోయారు.

Silk Smitha full life story
Silk Smitha full life story

అందుకు ప్రధాన కారణం ఆమె ప్రేమించిన వారు, అలాగే ఆమెకు చదువు లేకపోవడం. స్మిత ను ప్రేమ పేరుతో ఎంతో మంది మోసం చేశారు . తన దగ్గరికి తన డబ్బు కోసం మాత్రమే వచ్చేవారు. స్మిత మాత్రం వాళ్ళందరూ చెప్పేది ప్రేమ అనుకొని నమ్మేది.. ఎంతోమంది స్మిత జీవితంలోకి ప్రేమ పేరుతో వచ్చి వెళ్లిపోయారు. ఈ రెండు కారణాల వల్ల ఆమె అప్పుల్లో కూరుకుపోయింది. డబ్బులు పొదుపు చేస్తున్నామని, ఆస్తులు కొంటున్నామని చాలా మంది స్మితని మోసం చేశారు.

ఒక వ్యక్తి ప్రేమ పేరుతో స్మితకు దగ్గరయ్యాడు. అతనే స్మిత ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకునేవారు. స్మిత దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేసి మోసం చేశాడు. పైగా బ్యాంకులలో బయట ఫైనాన్స్ దగ్గర అప్పులు చేశాడు. వాటి మీద స్మిత చేత సంతకాలు కూడా పెట్టించాడు. స్మిత సినిమాలు ఫ్లాప్ అవడంతో అతను మెల్లగా తన దగ్గర నుంచి జారుకున్నాడు. ఇక ఆ తరువాత తాగుడికి బానిసైంది. సిల్క్ స్మిత మూడు రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా మందు తాగడంతో ఆమె మరణించింది.‌ ఈమె అందంతో నాలుగు భాషల లోని ప్రజలను ఓ ఊపు ఊపేసింది.. తనకంటూ గుర్తింపుని తెచ్చుకొని చరిత్రలో కొన్ని పేజీలను రాసుకొని వెళ్ళిపోయింది సిల్క్ స్మిత..