Mahesh Babu : కళ్యాణ్ గారితో సినిమా కోసం శేఖర్ మాస్టర్ వెయిట్ చేస్తున్నాడట. రెండుసార్లు అవకాశం వచ్చిందండి. అత్తారింటికి దారేది, అప్పుడు నాకు వేరే షూటింగ్ వచ్చి చేయలేకపోయాను.రెండు సాంగ్స్ మిస్ అయిపోయాను. డేట్స్ పోస్ట్ పోన్ అవ్వడం వలన మిస్ అయిపోయాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తో చేయాలని వెయిట్ చేస్తున్నాను. ఆయన చిన్న మూమెంట్ వేసినా కూడా అందంగా ఉంటుంది.సో ఆయనతో ఎప్పుడు చేస్తానో..అని చూడాలని ఉంది. ఏ హీరోతో కొరియోగ్రాఫర్ చేసిన కూడా భయం లేకుండా ఇష్టంతో ప్రేమతోనే చేస్తాను. అంటున్న శేఖర్ మాస్టర్.
రోజా మేడం మినిస్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.మేడం నవ్వితేనే అలానే చూడాలి అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి రోజా గారు అంటే నాకు చాలా ఇష్టం. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో ఉన్నప్పటి నుంచి రోజా గారు అందులో ఒక సాంగ్లో రోజా గారు చాలా బావున్నారు.అప్పటి నుంచి రోజా గారు అంటే ఇష్టం. చాలామంది ఇప్పుడు కంటెంట్ బేస్ ఉన్న మూవీస్ కావాలనుకుంటున్న డెఫినెట్గా మంచి కంటెంట్ ఉందని లవ్ స్టోరీ ఉందని థియేటర్ కి వచ్చి చూడండి. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. సాంగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఏప్రిల్ 22 థియేటర్కు వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్స్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రస్తుతం కళావతి సాంగ్లో మహేష్ బాబు గారితో అంత సాంగ్స్ చాలా బాగా చేయించారు. మహేష్ బాబు గారితో క్యూట్ గా స్టైలిష్ గా చేద్దాం..అన్న సెన్స్ తో అది కంపోజ్ చేసాము. లక్కీగా ఆయన కూడా చాలా అందంగా చేయడం చాలా బాగా హిట్ అయింది. అలాగే దాంట్లో మాస్ సాంగ్ కూడా చేయబోతున్నాం.. అది తొందరలో రిలీజ్ అవుతుంది.మహేష్ బాబు గారు ఏది చెప్తే అది 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు.అది నాకు బాగా నచ్చింది. మల్లెమాల అంటే నా పుట్టిల్లు లాంటిది.అంటున్న శేఖర్ మాస్టర్. నేను చాలా మూవీలు చేసినా కూడా “డీ” ద్వారా నేను ప్రజలకు పరిచయమయ్యాను. కావున అలాంటి దాన్ని నేను ఎందుకు మర్చిపోతాను అంటున్న శేఖర్ మాస్టర్.