Deepthi Sunaina : దీప్తి సునైనా బిత్తరపోయేలా ఖరీదైన కారు కొన్న షణ్ముఖ్ .. రేటు తెలిస్తే బిగ్ బాస్ ఫ్యాన్స్ వామ్మో అంటారు

Deepthi Sunaina : బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ దసరా సందర్భంగా తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకున్నారు. లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారును కొన్నారు. పేరేంట్స్ తో పాటు షోరూమ్ లో ఫోటోలు కూడా దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని ఎంతో హ్యాపీగా తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలతో పాటు షణ్ను పెట్టిన పోస్ట్ సైతం వైరల్ అవుతుంది.

Advertisement

నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్నవారు పేరేంట్స్, మీరు అంటే ఫ్యాన్స్ మాత్రమేనని, ఇంకెవ్వరూ కాదని కామెంట్ చేశారు. ఈ కారు కొనడం నిజంగా ఓ కలలా ఉందని, ఎప్పుడైనా కనిపిస్తే లిఫ్ట్ అడగండి అని తప్పకుండా ఇస్తానని అన్నారు. షణ్ముఖ్ కొన్న కారు ధర రూ. 51 లక్షల వరకు ఉంటుంది. యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన షణ్ముఖ్ సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారడమే కాకుండా బిగ్ బాస్ రన్నర్ గా నిలిచాడు.

Advertisement
shanmukh surprised Deepthi Sunaina
shanmukh surprised Deepthi Sunaina

Deepthi Sunaina : ‘ఈ కారు కొనడం ఓ డ్రీమ్ లా ఉంది’

ఇక బిగ్ బాస్ సీజన్ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ అయిన దీప్తీ సునయనతో బ్రేకప్ అయ్యారు. ఎంతో కాలంగా జంటగా వీరిద్దరూ పలు కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రజంట్ షణ్ముఖ్ లగ్జరీ కారును సొంతం చేసుకోగా, దీప్తి సునైనా షాక్ అయ్యే రీతిలో తన డ్రీమ్ కారుని సొంతం చేసుకున్నారని నెటిజన్లతో పాటు షణ్ణు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ టీమ్ మెంబర్స్ కూడా షాక్ అయ్యే రేంజ్ లో ఈ కారు కాస్ట్ ఉందని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా షణ్ముఖ్ తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement