Senior NTR: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. తరతరాలకి తరగని వెలుగవుతారు.. ఇలవేల్పులవుతారు అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం నందమూరి తారకరామారావు.. ఈ మాటే ఓ సంచలనం.. రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రతి తెలుగు వాడి ఆత్మగౌరవం.. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ .. శ్రామికుడి చమటలో నుండి వచ్చింది.. కార్మికుడి కరిగిన కండలాల్లో నుండి వచ్చింది.. రైతు కూలీల రక్తం నుంచి వచ్చింది.. నిరుపేద కన్నీటిలో నుండి కష్టజీవుల తండ్రి మంటల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం ఆశీర్వదించండి అంటూ.. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ చెప్పారు.. అప్పటినుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకు ఏ ప్రసంగంలోనైనా సరే తెలుగులో మాట్లాడడం ఆయనకే సాటి.. తెలుగు భాషలో ఇప్పటి రాజకీయ నాయకులు మాట్లాడడమే మర్చిపోయారు..
దేశభాషలందు తెలుగు లెస్స.. అటువంటి మధురమైన భాషకు వారసులు మనం.. తెలుగుదనం ఒక్కసారి వికసించిందా.. పరిమళంతో పరిమళించుతుందా.. తెలుగు మూర్తివంతంతో వెలిగిపోతుందా అన్నట్లుగా.. ఈ సభా వికాస విధానానికి ఈ తెలుగుతనానికి వన్నెతెచ్చిన నా వారికి .. ఈ ఆత్మీయులకు, నా ఆడపిల్లలకు, అన్నదమ్ములు అందరికీ, సమాఖ్య అధ్యక్షులకు అందరికీ నా నమస్కారాలు.. అంటూ నందమూరి తారక రామారావు అనర్గళంగా తెలుగులో మాట్లాడి తెలుగుదనానికి వన్నె తెచ్చారు. ఆ ప్రసంగంలో ఒక్క మాట కూడా ఇంగ్లీష్ పదాన్ని వాడకపోవడం నందమూరి ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం..
మన తెలుగువారి ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనందరం కలిసికట్టుగా ఉంటూ.. మావారిని అందరికీ చెప్పుకుంటున్నాం.. అది మీ యొక్క విశిష్ట సాంప్రదాయ విధానం. అందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.. కులమత వర్గ విభేదం లేని జాతి మనది.. అంటూ తెలుగు లో అనర్గళంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే తెలుగు ఇంగ్లీష్ కలిపి కొడుతున్నారు. ఎక్కువగా ఇంగ్లీష్ పదాలనే మాట్లాడుతున్నారు కానీ నందమూరి తారక రామారావు మాత్రం మన కమ్మటి తెలుగు మాటలను తియ్యగా మాట్లాడుతూ.. ఏ సభకు విచ్చేసిన ప్రజలనైనా సరే నవ్వుతూ మాట్లాడుతూ చెప్పవలసిన మాటలను సూటిగా స్పష్టంగా చెప్పేవారు.