Sunday, May 22, 2022

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట తీర్పును రిపీట్ చేసిన సుప్రీం కోర్టు.. దేశ వ్యాప్తంగా సంబరాలు..

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన అన్ని సినిమాలలో ఒక సామాజిక అంశాల్ని జోడించి.. దాని ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని తెలియజేస్తూ వస్తున్నారు.. సుమారు రెండున్నర సంవత్సరాల తరువాత మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట థియేటర్స్ లో విడుదలై విశేష స్పందన ను సొంతం చేసుకుంది.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు మోత మోగిస్తోంది.. సర్కారు వారి పాట చిత్రం ద్వారా మహేష్ అప్పు తీసుకున్న వారు ఎంత బాధ్యతగా ఉండాలో తెలియజేశారు..

అప్పు తీసుకుంటే ఎంత బాధ్యతగా తీర్చాలి. అప్పు తీర్చకపోతే మధ్య తరగతి వారు పరువు కోసం వాళ్ల ప్రాణాలు కూడా తీసుకుంటుందన్న విషయాన్ని మహేష్ బాబు ద్వారా అద్భుతంగా తెరకెక్కించారు పరశురామ్.. ఈ చిత్రంలో మహేష్ తల్లిదండ్రులు బ్యాంక్ నుండి రుణం తీసుకుంటారు.. ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. మహేష్ బాబు తండ్రి గా ఈ సినిమాలో నాగబాబు రైతుగా నటించారు. దాంతో బ్యాంకు వారి ఇంటిని జప్తు చేస్తుంది. అదేవిధంగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి తీర్పు మాదిరిగానే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

Sarkaru Vaari Paata Movie related Justice on Supreme Court on Farmers
Sarkaru Vaari Paata Movie related Justice on Supreme Court on Farmers

రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఇదే అంశాన్ని ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాస్తవం లో చెప్పడం విశేషంగా మారింది.. రైతుల నుంచి లోన్ రికవరీ చేయాలి అంటూ ఓ బ్యాంకు వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.. ముందు పెద్ద చేపలు పెట్టుకోండి.. ఆ తర్వాత వీళ్ళ జోలికి వెళ్ళండి.. ఇటువంటి పిటిషన్ వలన రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి అంటూ.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు..

Related Articles

- Advertisement -

తాజా వార్తలు