Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట.. రెండున్నర సంవత్సరాలుగా ఎదురుచూసిన మహేష్ అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించాడు ఈ చిత్రంతో మహేష్.. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి సర్కారు వారి పాట మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని.. విడుదలైన మొదటిరోజే అమెరికాలో వన్ మిలియన్ మార్క్స్ సొంతం చేసుకుని మొదటి రికార్డ్ బోణీ కొట్టింది.. అప్పటినుంచి వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు మహేష్..!

ఆ తరువాత యుఎస్‌లో రెండు మిలియన్ మార్స్ ను సొంతం చేసుకున్న పదకొండవ చిత్రంగా రికార్డులకు ఎక్కింది సర్కారు వారి పాట.. ఈ చిత్రంతో 2M మిలియన్ మార్క్స్ సొంతం చేసుకున్న నాలుగవ స్టార్ హీరోగా మహేష్ మరో వండర్ క్రియేట్ చేశారు.. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది.. నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది సర్కారు వారి పాట.. ఇలా వరుస రికార్డులు మొదలయ్యాయి ఈ సినిమా తో.. తాజాగా మహేష్ బాబు మరో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశారు..
సర్కారు వారి పాట సినిమా పదవరోజు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకొని దుమ్ము రేపింది. మహేష్ బాబు కెరీర్ లో నాలుగో సారి 100 కోట్ల షేర్ మార్కును అందుకుని సంచలన రికార్డు క్రియేట్ చేయడం విశేషం.. టాలీవుడ్ చరిత్రలో రీజనల్ మూవీస్ తో ఇలా నాలుగు సార్లు 100 కోట్ల మార్కును అందుకుని ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు నమోదు చేసి చరిత్రలో నిలిచాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో మరో 100 కోట్ల మార్కును అందుకుని బ్యాక్ టు బ్యాక్ నాలుగుసార్లు ఇలాంటి రికార్డులు క్రియేట్ చేశారు మహేష్ బాబు. సర్కారు వారి పాట కలెక్షన్స్ తో ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.