Samantha: సమంత సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అదే సినిమాలో నటించిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కానీ వీళ్ళ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు.. సమంత పెళ్లి చేసుకునే ముందే ఆ విషయాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ముందే చెప్పారు.
సమంత అమావస్య రోజున పుట్టింది. పండితులు చెబుతున్న విషయాల ప్రకారం.. అమావాస్య రోజు పుట్టడం వల్ల జీవితంలో కష్టాలు పడాల్సి ఉంటుంది. అమావాస్య రోజున పుట్టిన వాళ్లకు ప్రేమ, ఆర్థిక విషయాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. అమావాస్య రోజు పుట్టడం వల్ల ఆడపిల్లలకు కొన్ని లాభాలు ఉన్నా ఆ లాభాలతో కూల్చి చూస్తే నష్టాలు ఎక్కువగా ఉంటాయి..
అమావాస్య రోజు పుట్టిన వాళ్లకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండటంతో పాటు వీళ్ళు ఏదైనా అపశకునం కోరుకుంటే అది వెంటనే జరుగుతుందట. సమంత పుట్టినరోజే ఆమె పాలిట శాపం అయింది. కొన్ని పూజలు నివారణలు పాటిస్తే సమంత జీవితం బాగుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నాగచైతన్య సమంత విడిపోవడానికి సమంతా అమావాస్య రోజు పుట్టడమే కారణమని టాక్ నడుస్తోంది. వేణు స్వామి కూడా సమంత జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు వీరి పెళ్లి జరిగిన కొద్ది నెలలకే విరు విడిపోతారని వేనుస్వామి చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. తర్వాత అవే నిజం అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
గత రెండు మూడేళ్లగా మంతా కెరియర్ లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది.. చైతుతో విడాకులు, సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడం, ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్, ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి, ఇలా చాలా సమస్యలతో సమంతా పోరాటం చేస్తుంది. అయితే సమంత అమావాస్య రోజున పుట్టడం వల్లనే ఇవన్నీ జరుగుతుంది అని వేణు స్వామి మరోసారి సంచలన కామెంట్స్ చేయడం తో మరోసారి ఈ వార్త వైరల్ అవుతుంది.