Samantha – Naga Chaitanya : సమంతాతో నాగచైతన్య విడిపోయిన తరువాత కెరియర్ పరంగా ఇద్దరు ఎవరికీ వారు బిజీగా ఉండటం తెలిసిందే. 2017లో సమంతానీ పెళ్లి చేసుకున్న నాగచైతన్య 2021లో విడిపోవడం జరిగింది. ఇద్దరూ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించారు. అటువంటిది ఊహించని విధంగా ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఏ కారణంగా ఇద్దరు విడిపోయారు అన్నది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాని ప్రశ్న కాని మిగిలిపోయింది. వాళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకునే అంత గొడవకు కారణం ఏంటి అన్నది ఎవరికి తెలియదు. ఇక విడాకులు అనంతరం సమంత కూడా కెరియర్ పరంగా అనేక అవకాశాలు అందుకోవటం జరిగింది.”పుష్ప” సినిమాలో ఐటెం సాంగ్ చేయటంతో పాటు “ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ హిందీలో చేయటం రెండూ కూడా సమంతకి తిరుగులేని పేరుని తీసుకొచ్చాయి.
అనంతరం సమంత అనారోగ్యానికి గురికావడం తెలిసిందే. మయో సైటీస్ అనే వ్యాధితో సమంత పోరాడటం జరిగింది. దాదాపు మూడు నెలలపాటు హాస్పిటల్ కి పరిమితమైన సమంత ఇటీవల మళ్ళీ మెల్లగా కోలుకుని షూటింగ్ లకీ హాజరవుతూ ఉంది. ఇదిలా ఉంటే నాగచైతన్య ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నటి శోభిత ధూళిపాళతో ఇతర దేశాలలో చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఇటీవల ఓ రెస్టారెంట్ లో అక్కడ చెఫ్ తో ఫోటో కూడా దిగటం జరిగింది. ఆ ఫోటోలో వెనకాల శోభిత కూడా ఉండటంతో… వీరిద్దరి మేటర్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది.
అయితే సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా శోభిత ధూళిపాళ… చైతూ రిలేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన్నట్లు టాక్. ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నారన్నది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారు ఎంతోమందితో డేటింగ్ చేసిన చివర ఆఖరికి మిగిలేది కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని ఆ అమ్మాయిని నొప్పించకుండా ఉంటే అది అందరికీ మంచిది అంటూ సమంత కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.