Samantha : సమంత యశోద ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ పాన్ ఇండియా స్టార్స్..!!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు.. సమంత లేడీ ఓరియంటెడ్ కథతో తెరకెక్కుతున్న చిత్రం యశోద..! ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్, విశేషంగా ఆకట్టుకున్నాయి.. యశోద చిత్ర యూనిట్ దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు.. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న గెస్ట్ లపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!

Samantha Yashoda pre release event attend that two pan India stars
Samantha Yashoda pre release event attend that two pan India stars

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది.. అయితే ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ 27న సాయంత్రం 5:30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లుగా.. సమంత పై ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్ తో అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.. ఈ సినిమా నవంబర్ 11న అన్ని ప్రధాన భాషలలో విడుదల కానుంది.. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్.. అయితే ఇప్పుడు అందరి నోట ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురించే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది.. ఆ ఈవెంట్ కు ఏ హీరోలు గెస్ట్ గా రానున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్..

అయితే సమంత నటించిన యశోద చిత్రానికి ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అతిథులుగా రానున్నారని తెలుస్తోంది.. సమంత పుష్ప చిత్రంతో ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సమాచారం.. అదే విధంగా టాలీవుడ్ రేంజ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్నాడని తెలుస్తోంది.. ఒకే స్టేజి పైన ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కనిపిస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.. ఈ ఊహ ఊహించుకోవడానికే ఇంత ఆనందంగా ఉంటే.. అదే నిజమైతే బాగుంటుందని సినీ ప్రేక్షకులంతా అనుకుంటున్నారు.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది..