Samantha : సమంతను నమ్మితే రిజల్ట్ ఇలా ఉంటది.. ఆ విషయం తెలిసినా నాగచైతన్య ఎందుకు వదిలేశాడు.!?

Samantha :  సమంత లీడ్ రోల్ లో నటించిన సినిమా యశోద.. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు టాక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గకుండా సమంత తన నటనతో అభిమానులను మెప్పించింది. ప్రతి సీన్లో సమంత అద్భుతమైన నటనతో ఆకట్టుకుందంటూ సామ్ పై ప్రశంసాల వర్షం కురిపించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఫ్యాన్స్ కు సమంతా కృతజ్ఞతలు తెలిపారు. యశోద సినిమా సక్సెస్ పై తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!

Advertisement
Samantha Yashoda Movie emotional post link to nagachaithaya
Samantha Yashoda Movie emotional post link to nagachaithaya

ప్రియమైన ప్రేక్షకులకు.. యశోద సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మద్దతు మాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ధియేటర్లలో మీ సంబరాలు చూసా.. సినిమా ఎలా ఉందో మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం నిర్విరామంగా పడిన కష్టం కనిపిస్తోంది. ఇప్పుడు నా మనసు గాల్లో తిడుతున్నట్లుగా ఉంది. యశోద ప్రాజెక్టులో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు. నా పైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకులు హరి, హరీష్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు అని సమంత ట్వీట్ చేసింది.

Advertisement

సమంత పై నమ్మకం ఉంచి సినిమా తీసిన నిర్మాత, డైరెక్టర్లకు సమంత టాలెంట్ ఏంటో అర్థమైంది. అలాంటిది సమంతను ఏడు సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య ఆ తర్వాత మూడేళ్లు కలిసి కాపురం చేశారు. అయినా కూడా సమంత మీద నమ్మకం లేకుండా ఎందుకు విడాకులు ఇచ్చారు అంటూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వాదన తీసుకొచ్చారు. సినిమా తీయడానికి తన మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తే.. హిట్ గా అయ్యే వరకు సమంత తన వంతు కృషి తను చేసింది. అలాంటి నమ్మకమే నాగచైతన్య సమంతపై ఉంచితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకొని ఉండేది.. అని సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Advertisement