Samantha : వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ తో భయపెడుతున్న సమంత..!!

Samantha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు పలుసేవా కార్యక్రమాలలో కూడా తన వంతు సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటుంది. ఇకపోతే గత తొమ్మిది సంవత్సరాలు నుంచి ప్రత్యూష ఫౌండేషన్ కి డబ్బు సహాయం చేస్తూ ఎంతో మంది పిల్లలను ఆదుకుంటున్న సమంత ఈ మధ్యకాలంలో ఆడవారికి, చిన్నపిల్లలకు ఇబ్బంది కలగకుండా తనదైన సహాయం చేస్తూ వస్తోంది. అంతేకాదు గురుకులాలకు కూడా భారీ విరాళాలను ప్రకటించింది. ఇక ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన సమంత తన ఫిజిక్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వరుసగా జిమ్ సెంటర్ కు వెళ్తూ తన బాడీ షేప్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి సమంత మంచి ఫిట్నెస్ ప్రియురాలు.. ఇక ప్రతిరోజు కొంత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తూ ఉంటుంది. చెమటలు కక్కుతూ ఈమె చేసే వర్క్ అవుట్.. లుక్ చేంజ్ ఓవర్ కోసం తాను తీసుకునే జాగ్రత్తలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రెగ్యులర్ ఫిట్నెస్ ఫ్రీక్ అనిపించుకోవడం కోసం శ్రమిస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇదే విషయాన్ని చాలా సందర్భాలలో రివీల్ చేసిన సమంత డైట్ విషయంలో కూడా అంతే కేర్ఫుల్ గా వ్యవహరిస్తుంది. ఇక యానిమల్ ప్రోటీన్ కి దూరంగా ఉండే సమంత వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటుంది. ముఖ్యంగా పచ్చదనం నిండిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంది. ప్రతిరోజు గుడ్డు, బట్టర్ వంటివి పరిమితంగా తీసుకుంటుంది.

Samantha workouts video on youtube
Samantha workouts video on youtube

ఇక జిమ్ తర్వాత యోగ క్లాసులకు వెళ్తూ ధ్యానంలో ప్రశాంతత కోసం మునిగిపోతుంది. ఇకపోతే తాజాగా ఈ అమ్మడు జిమ్ములో ఎంత శ్రమిస్తూ ఉందో ఇప్పుడు ఒక వీడియో చూస్తే తెలుస్తుంది. జిమ్ దుస్తుల్లో హెవీ వెయిట్ డంబుల్స్ ఎత్తుతూ మజిల్స్ కి షేప్ తీసుకొస్తోంది. ముఖ్యంగా మేల్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఎంతగా ఇష్టంగా కష్టపడుతుందో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఈమె వర్కౌట్ చూసి అబ్బాయిలు కూడా భయపడుతున్నారు. ఇక అంతేకాదు” జీవితం కఠినమైనది.. నేను కూడా అలాగే ఉన్నాను.. ఈరోజు మీరు చేస్తున్న పోరాటం రేపు మీకు అవసరమైన శక్తిని అందిస్తుంది”.. అంటూ కూడా సమంత రాసుకుంది.. ఏది ఏమైనా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మానసికంగా మరింత బలపడిందని చెప్పవచ్చు.

Advertisement