Samantha : అక్కినేని నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత ఇద్దరు సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోల్లింగ్స్ కు గురవుతున్న సంగతి తెలిసిందే.. కాకపోతే ఇద్దరూ సెలబ్రిటీస్ కావడంతో.. వీళ్ళ రెండో పెళ్లి విషయం తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. వీళ్ళిద్దరి విడాకుల విషయంలో సమంతనే అందరూ టార్గెట్ చేశారు కానీ సమంత మాత్రం ఇప్పటివరకు ఏ రోజు నెగిటివ్ గా రియాక్ట్ కాలేదు.

సమంత నాగచైతన్య కి గాని అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి నెగటివ్ ప్రకటనలు కానీ సమాచారం ఇవ్వలేదు మొదటిసారి సమంతా తన శైలికి భిన్నంగా మాట్లాడినట్లు కనిపించింది. ఇటీవల శాఖ విడాకుల గురించి మరోసారి మాట్లాడింది. తన తప్పేం లేదని వైవాహిక సంబంధం గురించి పలు ఆసక్తికర విషయంలో పంచుకుంది. వైవాహిక బంధానికి సంబంధించి తను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నానని.. తన బంధానికి తను అంకితమయ్యానని చెప్పింది.. అయితే సమంత విడాకులపై స్పందించిన టైమింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.
మరోపక్క నాగచైతన్య సోబిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత ఇలా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. సమంత చైతు అసలు ఎందుకు విడిపోయారు అనేది 1000 మిలియన్ల డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్న కి సమాధానం మాత్రం ఇద్దరి వైపు నుంచి రావడం లేదు. ఇటీవల శోభితతో కలిసి నాగచైతన్య లండన్ లో ఓ ప్రైవేట్ రెస్టారెంట్లో కలిసి భోజనం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోపక్క సమంత మాట్లాడిన మాటలకు చైతన్య డేటింగ్ చేస్తున్న ఫొటోలను జోడిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సమంతా తప్పు ఏమీ లేదు అంటే నాగచైతన్య వైపే మిగతా వాళ్ళందరి కళ్ళు చూస్తున్నాయి.
