samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్ సినీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. నటించిన సినిమాలను వరుసగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు కొత్త కొత్త సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలా ఉంటే సమంత ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

కానీ గత కొంతకాలంగా ఆమె మయోసిటీస్ అనే వ్యాధి బారిన పడడంతో.. ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి పూర్తిస్థాయిలో కోలుకొని మళ్ళీ సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది.. ఒకవైపు జూన్ లో వర్కౌట్ లు చేస్తున్నా.. మరొకవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటూ యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉండగా ఈమె తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టును షేర్ చేసింది. అది ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది..
సమంత తన పోస్టు ద్వారా..” గట్టిగా ఊపిరి పీల్చుకో పాప.. త్వరలో అన్నీ సర్దుకుంటాయి అని నేను నీకు మాటేస్తున్నాను.. గత 7 , 8 నెలలుగా నువ్వు చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు సాగావు ..ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తు పెట్టుకో.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ధైర్యంగా అడుగు వేశావు.. ఈ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నాను.. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో ” అంటూ జనవరిలో జరిగిన విషయాలను మరొకసారి గుర్తుచేసుకుంది సమంత ..ప్రస్తుతం అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.