Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను గొప్పగా చిత్రీకరించాలనుకునే గుణశేఖర్ శాకుంతలం వంటి పౌరాణిక ప్రేమ గాధను ఎలా తెరకెక్కించి ఉంటారో మనందరం అర్థం చేసుకోవచ్చు..ఈ సినిమాలో దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతల పాత్రలో సమంత నటించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
త్రీడి టెక్నాలజీతో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి.
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 17 నుంచి మార్చి 27 కి ఆయుధ వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. సినిమా కూడా ముందుగా మార్చిలోనే విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అఖిల్ ఏప్రిల్ పోస్ట్ ఫోన్ చేసుకున్నారు. ఒకవేళ ఇద్దరి సినిమాలు గనుక ఏప్రిల్ లో విడుదలయితే ఆ క్లాష్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.