Samantha : నాగ చైతన్య తో విడాకుల తరవాత సమంత కి ఇదే మొట్టమొదటి గుడ్ న్యూస్ !

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శాకుంతలం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకుని విదుదలకు సిద్దంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Samantha shakuntalam movie intresting update
Samantha shakuntalam movie intresting update

శాకుంతలం సినిమాను ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 17న కాకుండా.. కొన్ని రోజుల తరువాత విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మార్చి 17న ఆలోచన చేశారు. కానీ అది కూడా అంతగా సానుకూలమైన డేట్ కాకపోవడంతో ఫైనల్ గా ఏప్రిల్ కి వెళ్లే సంకేతాలు బలంగా ఉన్నాయి. యశోద సక్సెస్ తర్వాత సమంత చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. కేవలం తన బ్రాండ్ మీదే బిజినెస్ జరుగుతోంది. ఆడిన ఆడకపోయినా గుణశేఖర్ తో సమానంగా ఆ క్రెడిట్ ని తీసుకోవాల్సి ఉంటుంది..

అందుకే ప్రమోషన్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకే అన్ని విధాల ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో రావాల్సిన చిరంజీవి బోలాశంకర్, రజినీకాంత్ జైలర్ రెండు చిత్రాలు వాయిదా పడటంతో ఇదే మంచి అవకాశం అని ఫిక్స్ అయ్యారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

శాకుంతలం సినిమా విడుదల కావడానికి 60 రోజులకు పైగా సమయం ఉంది. కాబట్టి ప్రమోషన్లను నిక్షేపంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈలోపు సమంత మిగతా సినిమా షూటింగ్స్ లను కూడా కంప్లీట్ చేస్తుంది. 3d టెక్నాలజీతో రూపొందిన ఈ పిరియాడిక్ డ్రామాను అన్ని ప్రధాన భాషలలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరోవైపు కార్తీక్ ఆర్యన్ నటించిన షెజదా సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సి ఉండగా.. ఆ చిత్ర విడుదల తేదీని కూడా వాయిదా వేసుకున్నారని సమాచారం.. అందులో భాగంగా శాకుంతలం రిలీజ్ డేట్ పోస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. బహుశా మార్చి నెలలో శాకుంతలం విడుదల అవ్వచ్చని టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాకపోతే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రాలేదు..

ఈ విషయం తెలిసి అక్కినేని బాగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారట. సమంతకి అలాగే ఉండాలి.. సౌత్ కి వెళ్లిపోవాలని ఒకప్పుడు అనుకున్నవు.. ఇప్పుడు అక్కడ నీ సినిమా కి స్క్రీన్ దొరకడం కష్టంగా ఉంది అంటూ పోస్టులు చేస్తున్నారు.