Samantha: విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.. ఇక విజయ్ తన ఆశలన్నీ తన నెక్స్ట్ సినిమా ఖుషి పైనే పెట్టుకున్నాడు.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది.. ఇక్కడి వరుకు బాగానే ఉన్నా.. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.. దాంతో విజయ్ ఓ నిర్ణయం తీసుకున్నారని టాక్.. విజయ్ దేవరకొండ సమంతకు బిగ్ షాక్ ఇవ్వనున్నాడని అనుకుంటున్నారు సినీ ప్రముఖులు.
రౌడీ హీరో విజయ్ కెరియర్ ఈ మధ్యకాలంలో అస్సలు బాలేదు. కాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకునింది అర్జున్ రెడ్డి తోనే. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఓ మోస్తరుగా నిలిచాయి. విజయ్ తన ఆశలన్నీ ఖుషి సినిమా పై పెట్టుకున్నాడు. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ.. ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత మయోసైటిస్ అనే వ్యాధికి గురైంది. దాంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ పడింది.
హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి ఇదో బ్యాడ్ న్యూస్.. ఇప్పటికే చాలా టైమ్ వేస్ట్ అయింది. సో.. గౌతమ్ తిన్నూరి తో సినిమాకు ఓ చెప్పాడు. ఇక రేపో మాపో ఈ సినిమా షూటింగ్ కూడా సెట్స్ పైకి వెళ్లనుందట. ఇప్పటివరకు విజయ్ సమంతా కోసం ఎదురు చూశాడు కానీ సమంత కోలుకున్నా కానీ శకుంతలం సినిమా పైనే తన ఫోకస్ పెట్టింది.
అందుకే విజయ్ కి కోపం వచ్చి గౌతమ్ తో చేయనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం. ఈ విషయం ఆ నోట ఈ నోటా పాకి మైత్రి మూవీ మేకర్స్ కూడా సమంతను ఎలాగోలా ఒప్పించి ఫిబ్రవరి చివరివారంలో ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి సన్నాహాలు చేస్తున్నారట.