Samantha : ‘ ఆ రోజు , అలా’ చేసి ఉండకపోతే .. ఈ రోజు బెడ్ మీద పడి ఉండేదానివి కాదు కదా సమంత !

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ టైటిల్ రోల్ లో సరోగసి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా యశోద.. ఈ చిత్రంలో సమంత పలు యాక్షన్ సన్నివేశాల్లో నటించారు.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ సారథ్యంలో సమంతా ఈ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది.. సమంత యశోద ఫైట్స్ షూటింగ్ వెనుకున్న ప్రిపరేషన్, తన పడిన కష్టాన్ని వివరిస్తూ ప్రత్యేక వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది..

Advertisement
Samantha heavy workouts on Yashoda Movie that's why attcks myostis
Samantha heavy workouts on Yashoda Movie that’s why attcks myostis

ఈ సినిమా లో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు.. సమంత చేసిన యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి వివరిస్తూ యానిక్ బెన్ మాట్లాడారు.. నేనెప్పుడూ యాక్టర్ సేఫ్ గా ఉండేలా చూసుకుంటాను.. వాళ్లను యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్ గా తెలియాలి.. అందుకని ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపోజిషన్ చూపిస్తాను.. అందువల్ల వాళ్లకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాము.‌ సమంత చాలా డెడికేటెడ్ గా షూటింగ్ పూర్తి చేశారు.. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.. యాక్షన్ డైరెక్టర్ కోరుకునేది అదే కదా.. అందుకని ఆమె షూటింగ్ ఆమెతో షూటింగ్ చేయడం బాగుంది. యాక్షన్ ఎప్పుడూ రియలిస్టిక్ గా ఉండడం నాకు ఇష్టం.. యశోదలో స్టన్స్ కూడా రియలిస్టిక్ గా ఉంటాయి.. రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుందో యశోదలో యాక్షన్స్ కూడా అలాగే రియలిస్టిక్ గా ఉంటుంది.. కిక్ బాక్సింగ్, జూడో, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో కూడిన యశోద యాక్షన్ సీన్స్ లో ఉంటాయి అని చెప్పుకొచ్చారు..

Advertisement

యశోద యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సమంత డెడికేషన్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.. అలానే సమంతపై కూడా బాధపడుతున్నారు.. ఆ రోజు తను అలా యాక్షన్స్ సీన్స్ చేసి ఉండకపోతే ఈరోజు ఇలా బెడ్ మీద పడి ఉండేది కాదు అని కొందరి అభిప్రాయం.. తను చేసిన హెవీ వర్కౌట్స్ కారణంగా ఈరోజు బెడ్ పై ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. సమంత 100 కిలోలకు పైగానే బరువు ఎత్తిందట.. దాంతో సమంతకి మయోసైటిస్ వచ్చిందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు.. ఈ ప్రశ్న సమంత వరకు వెళ్ళగా.. ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఈరోజు బెడ్ మీద పడి ఉండే దానిని కాదు.. కానీ ఆ బెస్ట్ పెర్ఫార్మన్స్ నేను ఇవ్వకుండా ఉండలేను.. తీసిన ప్రతి సినిమాని మనం హార్ట్ ఫుల్ గా ఫీలై చేయాలి.. అప్పుడే అవుట్ ఫుట్ అద్భుతంగా వస్తుంది అని సమంత తన సన్నిహిత వర్గాల వారితో చెప్పిందట..

సమంత నటించిన యశోద సినిమాను హరి హరీష్ లు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ పై విశేషమైన స్పందన వచ్చింది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది.. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి..

Advertisement