Samantha: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత కొద్ది రోజుల క్రితం తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి అందరిని ఆందోళనకి గురి చేసింది. ఎంతో సంతోషంగా ఉండే సమంతకి ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయని ఆమె ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. తనకు కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పుకొచ్చిన సమంత, త్వరలోనే ఈ వ్యాధి నుంచి కోలుకుంటానని, ప్రస్తుతం దీనికి మంచి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే ఒకవైపు వ్యాధితో బాధపడుతూనే తాను యశోద చిత్రానికి డబ్బింగ్ చెప్పింది.

ఆరోగ్యానికి ఏమైంది..
యశోద చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేస్తూ తన వ్యాధి గురించి ప్రకటించింది సమంత . ప్రతి 10 వేల నుంచి లక్ష మందిలో ఒకరిని వేధించే ఈ వ్యాధి, హీరోయిన్ సమంతకూ సోకింది. ఇటీవల సమంత మయోసైటిస్ సమస్య పై ఆసక్తికర కామెంట్స్ చేసింది యశోద నటి కల్పిక. యశోద సినిమా సక్సెస్‌మీట్‌లో కల్పిక మాట్లాడుతూ.. .. తను కూడా సమంత లాగే ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. సమంతకు ఉన్న మయోసైటిస్ తనకు గత 13 ఏళ్లుగా ఉందని.. ఇప్పుడు తను ఫస్ట్ స్టేజ్ లో ఉందని.. కానీ సమంత థర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పడంతో అభిమానులు మరింత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యంపై ఆరాలు తీస్తున్నారు.
అయితే గత వారం రోజులుగా యశోద కార్యక్రమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సమంత తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టలేదని తెలుస్తుంది. సమయానికి సరైన డైట్ తీసుకోకపోవడంతో పాటు సరైన టైంలో ట్రీట్మెంట్ కూడా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఆమె మరింత క్షీణించడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. సమంతకు సీరియస్‌గా ఉండడంతో వెంటనే ఆమెను ఇప్పుడు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. నీరసించిపోయి కండరాలు నొప్పి ఎక్కువైపోయి.. స్పృహ తప్పి పడిపోయిన సమంతని.. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేర్పించి మంచి వైద్యం అందిస్తున్నట్టు టాక్. ఈ విషయంపై సమంత బంధువులు కాని ఆమె పీఆర్ టీం కూడా ఎవరు స్పందించకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.