Samantha :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ థర్డ్ సేజ్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం రోజురోజుకి ఆందోళన కలిగిస్తుంది. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా, ఆమె నటించిన యశోద ఈనెల 11న విడుదల కాగా, ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సమంత అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. సమంత మయోసైటిస్ అనే దీర్ఘకాల కండరాల వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసిన వెంటనే సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తూ.. ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాదు సమంతకు ధైర్యం చెప్పారు.

సమంతకి అండగా చైతూ..
అయితే ఈ వ్యాధికి మందులేవి లేవని ధనిక దేశాల మందులు వాడుతున్నా నయం కావడం లేదని సమాచారం. దీంతో సమంత ఈ వ్యాధి నుంచి ఎలాగైనా బయటపడాలని దక్షిణ కొరియాకి కూడా వెళ్లిందట.. ప్రస్తుతం ఉన్న ఆ మందులను ఆపేసి పూర్తిగా ఆయుర్వేదిక్ మందుల వాడాలని ఆమె డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత పరిస్థితి చూసి నాగ చైతన్య కూడా చాలా ఆందోళన చెందుతుండగా, సమంతతో పాటు నాగ చైతన్య కూడా దక్షిణ కొరియా వెళ్లాడని దగ్గరుండి ఆమె బాగోగులు అన్నీ చూసుకుంటన్నాడని టాక్.
మయోసైటిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితిని సమంత నాగచైతన్యకి ఇప్పటికే వివరించిగా, అప్పటినుంచి చైతన్య ఆమెపై కేర్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం దృష్ట్యా నాగచైతన్య సమంతతో దక్షిణ కొరియాకు వెళ్తున్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవరు ఊహించని విధంగా గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల సమంత ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి, ఆమె ఆరోగ్యం క్షీణించిందని .. సామ్ ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సామ్ కుటుంబం, మేనేజర్ క్లారిటీఇచ్చారు. అలాంటిదేం లేదన్నారు.