Samantha : స్నేహం కోసం ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిన సినిమాని సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నిరోజులుగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో సమంత ఆరోగ్యం పై రకరకాల కథనాలను పుట్టించారు.. తాజాగా సమంత కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది..

Samantha green signal to tollywood movie
Samantha green signal to tollywood movie

యశోద సినిమా సక్సెస్ తర్వాత సమంత తన ఫ్రెండ్ చిన్మయి హస్బెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా సినిమా ప్రమోట్ చేస్తున్నారు. సమంతతో రాహుల్ రవీంద్రన్ ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ ముందుగా ఈ కథను నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు వినిపించగా ఆమె రిజెక్ట్ చేశారట.. ఇప్పుడు అదే కథతో సమంతతో లేడీ ఓరియేంటెడ్ సినిమా చేయడానికి రాహుల్ రవీంద్రన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు ఫ్రెండ్ కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అవసరమా.. అది కూడా రష్మిక రిజెక్ట్ చేసిన మూవీ ని సెలెక్ట్ చేసుకోవడం అవసరమా అని అంటున్నారు.. ఏది ఏమైనా సరే నువ్వు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ సినిమా చేస్తున్నావంటే మా అందరికీ ఆనందమే అంటూ.. సమంత ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు..