Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయైసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ సాధారణ వర్కవుట్స్ చేస్తూ.. కోలుకోవడానికి పోరాటం చేస్తుంది. ఫిట్ నెస్ పరంగా ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలోనూ సామ్ జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోస్ తెగ వైరలయ్యాయి..

సమంత కేవలం వర్కవుట్స్ మాత్రమే కాదు..మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమని చెబుతుంది. అప్పట్లో తన ఇంట్లోని గార్డెన్ ఏరియాలో వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ తాను తీసుకునేఫుడ్ గురించి చెప్పింది. 2020 నవంబర్ లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సమంత గార్డెన్ ఏరియాలో చాలా యాక్టివ్ వర్కుట్ చేస్తుంది. ఏది ఏమైనా సమంత త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. మళ్ళీ సినిమాలు చేసి వెండితెర పై కనిపిస్తే ఆ ఆనందమే వేరు.