Samantha : సమంత సినిమాలకు దూరం కానుందా.. కారణమదేనా..?

Samantha :  టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం మయోసిటిస్ అనే సమస్యతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. సమంత నటించిన యశోద సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, ఖుషి సినిమాలు ఉన్నాయి. సమంత అనారోగ్యం కారణం చేత ఈ సినిమాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి. కానీ సమంతకు ఈ వ్యాధి తగ్గుతుందనుకుంటే ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. దీంతో సమంత గత కొన్ని రోజులుగా మంచానికే పరిమితమైందని వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha far away from film industry..!
Samantha far away from film industry..!

బెడ్ మీద ఉండగానే యశోద సినిమాను ప్రమోట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సమంత ఇప్పుడు కోలుకొనేలా కనిపించలేదని దీంతో వైద్యులు కొద్దిరోజులు సమంతను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సినిమాలను ఒప్పుకోకూడదని ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను మాత్రమే ఫినిష్ చేయాలనుకుంటోందట.

ప్రస్తుతం సమంత చేతిలో బాలీవుడ్ మూవీలు, వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. కానీ వాటిని కూడా వద్దనుకొని సమంత రిజెక్ట్ చేసినట్లుగా సమంత టీమ్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇకమీదట సమంత కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోదని కొంతకాలం ఆమె విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలియజేసినట్లు సమాచారం. సమంత ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.