Samantha: సమంత నాగ చైతన్య ఏమాయ చేశావే సినిమాతో మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. ఆ సినిమాతో వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది.2017 అక్టోబర్ 6 న వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వీరిద్దరూ మూడేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు..
వారు కలుసుకున్న మూడు పెళ్లి రోజులు సెలబ్రేషన్స్ కి కూడా సమంత చైతు పై ఇంట్రెస్టింగ్ నోట్ రాస్తూ ఫోటోలను విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.. సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆ జ్ఞాపకాలను అని ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తూ వచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పటి నుండి చైతుకి సంబంధించిన వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా పంపించింది సమంత.
ఈ క్రమంలోనే సమంత పెళ్లి కోసం కట్టుకున్న చీరను కూడా వెనక్కి పంపించేసినట్లు తెలుస్తోంది. సమంత తన పెళ్లికి కట్టుకున్న చీర దగ్గుబాటి రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే స్వయానా నాగచైతన్య అమ్మమ్మ చీర కావడం విశేషం. ఆ చీర కూడా సమంత పంపించేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సమంత చైతుకి గుర్తుగా పలు టాటూలు వేయించుకుంది. అవి మాత్రం చేరుకోలేక పోయింది. చైతు సమంత నటించిన మొదటి సినిమాఏం మాయ చేసావే సినిమాకు గుర్తుగా సమంత వీపుపై వైఎంసి అనే టాటూ వేయించుకుంది.. అంతేకాకుండా కుడి చేతి మీద రెండు యారో మార్కులు ఉన్నాయి. అదే టాటూ చైతుకి కూడా ఉంటుంది. దీంతో పాటు సమంత తన రిబ్ పై చై అనే టాటూ కూడా వేయించుకుంది. ఇది ఇప్పటికీ అలానే ఉన్నాయి తెలుస్తోంది. కాకపోతే ఈ టాటూ లను సమంత తీసేయాలని అనుకుంటుందని ఓ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.