Samantha : సమంత కు ఇక తిరుగులేదు.. అరుదైన రికార్డు క్రియేట్ చేసిన సమంత..!

Samantha : ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకొని ప్రేక్షకుల్లో మనసుని మాయ చేసింది ఈ బ్యూటీ.. ఆ తరువాత అతి తక్కువ సమయంలో అగ్ర కథానాయకగా ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును పొందింది.. దాదాపు టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోల సరసన నటించింది.. తాజాగా సమంత ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది..

ప్రస్తుతం సౌత్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో సమంత టాప్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సమంత సౌత్ ఇండస్ట్రీ లో ఒక అరుదైన రికార్డ్ని క్రియేట్ చేసింది.. అదేంటంటే 100 కోట్లు గ్రాస్ హీరొయిన్ గా సమంత రికార్డు క్రియేట్ చేసింది. సమంత నటించిన దూకుడు, అత్తారింటికి దారేది, కత్తి, తేరి, జనతా గ్యారేజ్, రంగస్థలం, మెర్సల్ వంటి సినిమాలన్నీ 100 కోట్లు గ్రాస్ చేసిన సినిమా లో హీరోయిన్ గా నటించింది.. ఈ అరుదైన రికార్డుని ఇప్పటివరకు ఏ హీరోయిన్ బ్రేక్ చేయలేదు..

Samantha create new rare record on 100 crores gross collection heroine
Samantha create new rare record on 100 crores gross collection heroine

ఇలాంటి అరుదైన రికార్డుని క్రియేట్ చేయటంపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. సమంత వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతలం అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత మరో వైపు ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న యశోద సినిమాలో కూడా నటిస్తోంది.. సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. అంతే కాకుండా ఒక వెబ్ సిరీస్ కు సైన్ చేసినట్టు సమాచారం..

Advertisement