Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం యశోద. ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది.. ఇటీవల సమంత ఆరోగ్యం బాగోలేదన్న సంగతి తెలిసిందే.. ఈ దెబ్బతో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందు నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమని.. విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా కొంత భాగం పూర్తయింది. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో సమంతా విజయ్ దేవరకొండ తదితరులపై ఈ సినిమా షూటింగ్ జరిపారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ధ్రువీకరించారు. ఈ సినిమాని కొన్ని అనివార్య కారణాలవల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ సినిమాని డిసెంబర్ 23వ తేదీ విడుదల చేయడానికి నిర్మాతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా కూడా ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు సమంత అనారోగ్యం పాడిన పడటంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని.. ఈ సినిమాను వచ్చే ఏడాది మొదటి అర్ధ భాగంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విజయ్ దేవరకొండ చెబుతున్నారు..
ఇదిలా ఉంటే ఖుషి సినిమా ప్రొడ్యూసర్ సమంత వలనే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని.. తనవల్ల 12 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సమంతను ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు తెలుస్తోంది. నీకు ఈ వ్యాధి ఉందని దాచి మమ్మల్ని మోసం చేశావు. నీవల్ల 12 కోట్లు నష్టమని బెడ్ మీద పడి ఉన్న సమంతను ప్రొడ్యూసర్ నానా మాటలు అన్నారని.. సమంత సన్నిహితుల వర్గం నుంచి అందుతున్న సమాచారం.. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.. సమంత తన నోటితో తనే ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి ఇలా మాటలు పడాల్సి వస్తుంది అని ఆమె సన్నిహితులు బాధపడుతున్నారు..