Samantha : సమంత నటించిన లేటెస్ట్ చిత్రం యశోద.. ఈ పాన్ ఇండియా సినిమాను చూసిన పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు.. దర్శకులు హరి హరీష్ లు సమంత పాత్రను అధ్బుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.. అయితే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా లాగా యశోద చిత్రాన్ని విజయశాంతి నటిస్తే ఇంకా బాగుండేదని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు..
విజయశాంతి ఇలాంటి పాత్రలను అవలీలగా చేస్తుందన్నారు. అందం కోసం చిన్నపిల్లల ప్లాస్మాను ఉపయోగించడం.. దీని వెనక కోట్ల రూపాయల వ్యాపారం.. దీన్ని కనిపెట్టడం కోసం సమంత చేసిన ప్రయత్నం చాలా బాగుందన్నారు. అదేవిధంగా యశోద చిత్రంలోని చివరి 40 నిమిషాలు చూస్తే భయం వేస్తుంది అన్నారు.
యశోద ఓ అద్భుతమైన ప్రయోగమని.. యశోద చిత్రాన్ని చూసి ఒక స్త్రీని హీరోగా ఎలా చూపించాలో ఇందులో నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. చివరిగా నా సలహా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమానే కచ్చితంగా చూడమని పరుచూరి రిక్వెస్ట్ చేశారు.. పరుచూరి సమంత, యశోద చిత్రంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..