Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో , అందంతో ప్రేక్షకులను మైమరపింప చేసిన ఈ ముద్దుగుమ్మ.. చేసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది.. ఇక లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి ఫిదా సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే తెలంగాణ యాసలో అదరగొట్టేసింది.

ఇక ఇటీవల లవ్ స్టోరీ , శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల తాను నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు పెద్దగా గుర్తింపు అందించలేదు. దీంతో ఆమె సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో హాస్పిటల్ నిర్మించి.. తన వైద్య వృత్తిని కొనసాగించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేకపోయింది. ఇటీవలే ఒక సినిమాలో భాగం కాబోతోంది సాయి పల్లవి. ఇదిలా ఉండగా సాయి పల్లవి ఎప్పుడు వివాహం చేసుకోబోతోంది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సాయి పల్లవి తిరుపతిలో తన బాయ్ ఫ్రెండ్ ను రహస్యంగా వివాహం చేసుకుంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆ ఫోటోలను మనం తీక్షనంగా గమనించినట్లయితే అక్కడ మార్ఫింగ్ చేసిన ఫోటోలలో మలయాళం ప్రేమమ్ హీరో నివీన్ పౌలే ఫోటోని కవరేజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.