Sai Pallavi : తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె గార్గి, విరాటపర్వం సినిమాలతో పర్వాలేదనిపించుకుంది. అయితే ఇప్పుడు తెలుగులో ఒక సినిమాలో కూడా నటించకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా ఈమె బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి
తాజాగా బాలీవుడ్ లో రామాయణం సినిమాను తెరకెక్కిస్తుండగా అందులో రణబీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా ఆన్ స్క్రీన్ జంటగా మారి అలరించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2023 సెప్టెంబర్ లో ఈ సినిమా పట్టాలెక్కబోతుందని సమాచారం. సీత పాత్ర పోషించడానికి సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతం లో హృతిక్ రోషన్ రాముడిగా , దీపికా పదుకొనే సీత గా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మళ్లీ రణబీర్, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ ఖరారు అయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా 3కోట్ల రూపాయల పారితోషకం కూడా డిమాండ్ చేసిందని.. అది ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.