Sai Dharam Tej: కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ.. ఈ చిత్రానికి మురళీ కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు. ఈవెంట్ కు హాజరైన సాయి ధరమ్ తేజ్ స్పీచ్ నవ్వుతూ పలు విషయాలను పంచుకున్నారు..
ఈ ఈవెంట్ లో మాట్లాడిన సాయి ధరంతేజ్ నవ్వుల పువ్వులు పూయించారు.. ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్ చెప్తూ ఆకట్టుకున్నారు.. ఐ లవ్ యు అని చెప్పిన ఓ అభిమానికి అదిరిపోయే సమాధానం చెప్పడు.. లవ్ అనే వర్డ్ తనకి కలిసి రాలేదని వద్దురా.. అబ్బాయిలు ఇకపై ఆ పదాన్ని వాడకండి అని చెప్పాడు.
ఈ సందర్భంగా సాయి ధరంను పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ అడగగా ఇక్కడ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు ఎప్పుడైతే అమ్మాయిలను గౌరవించడం నేర్చుకుంటారో .. అప్పుడు అవుద్ది.. ఇది మీ వల్ల అవుతుందా అని ప్రశ్నించారు.. ఆ తర్వాత నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లయింది వద్దు అంటూ నవ్వుతూ చెప్పారు..
సార్ సెల్ఫీ ప్లీజ్ అని ఓ మహిళ అభిమాని కోరగా సారీ అమ్మ నాకు ఇప్పటికే పెళ్లయిపోయింది అని నవ్వుతు సమాధానం ఇచ్చారు. ఆయన మాటలకు ఈవెంట్లో వేదికపై ఉన్న సినీ తారలు, అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ కు నేను అభిమానిని. ఈ సినిమా పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసాను. ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి విజయం అందుకోవాలని సాయి ధరమ్ తేజ్ ఆకాంక్షించారు.