RRR : నాటు నాటు కు ఆస్కార్ పై చిరంజీవి ప్రశంసల వెల్లువ..

RRR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారందరికి గర్వ కారణం.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు వైయస్ జగన్ , కేసీఆర్ లు ఆస్కార్ విజేతలకు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఆస్కార్ దక్కించుకున్న మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ విన్నర్ గా నిలవడంపై సిని ప్రముఖుల నుంచి రాజకీయ మంత్రులు వరకు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ విషయంపై చిరంజీవి అభినందనలు తెలుపుతూ వీడియో పోస్ట్ చేశారు..

RRR Oscar winning chiru special appreciation video
RRR Oscar winning chiru special appreciation video

నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించడం పై చిరు సంతోషాన్ని తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణాలని.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి ఆర్ఆర్ఆర్ చిత్రం తో సాధ్యం అయిందని అన్నారు. దర్శకుడు రాజమౌళికి, సంగీత దర్శకుడు కీరవానికి, పాట రాసిన చంద్రబోస్ కి , పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతో పాటు ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించిన తారక్, రామ్ చరణ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

 

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక భాగం కావడం తనతో పాటు తన కుటుంబానికి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఈ విజయం మెగా ఫ్యామిలీకి గర్వకారణం తెలిపారు. ఆస్కార్ రావడం వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరికి తన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. 8 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఆర్ఆర్ఆర్ కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. నాటు నాటు లైవ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ స్టాండింగ్ ఇవ్వడం చూస్తే ఒళ్లంతా పులకించి పోయిందని చిరంజీవి అన్నారు.