RRR : సినిమా కి నిర్మాత ప్రధాన పిల్లర్.. దర్శకుడు సృజనకు నటుల వ్యక్తీకరణకు దృశ్యరూపం ఇవ్వాలంటే డబ్బులు కావాలి.. అవి సమకూర్చే వ్యక్తి నిర్మాత మాత్రమే ఒక సినిమా జయాపజయాలు లో నిర్మాతకు భాగం బాధ్యత ఉంటాయి. అలాంటి నిర్మాతను రాజమౌళి పక్కన పెట్టేసాడు. కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు.. అని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పు మంటున్నాయి..
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి ప్రఖ్యాత సినిమా వేదికపై అందరికీ క్రెడిట్ ఇచ్చారు. కానీ ఈ సినిమా నిర్మాత అయిన దానయ్య ఒక్కరికి తప్ప.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, చంద్రబోస్ అందరి పేర్లు పలికారు. కానీ నిర్మాత దానయ్య పేరు గోల్డెన్ గ్లోబ్ వేదిక పైన కూడా ప్రస్తావించలేదు. ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ తగ్గించుకున్న ఆర్ఆర్ టీం అక్కడ కూడా దానయ్య ప్రస్తావనే ఎత్తలేదు..
అయితే నిర్మాత గురించి మాట్లాడకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. రాజమౌళితో దానయ్యకు ఎప్పుడో చిన్న క్లాస్ జరిగింది అని సమాచారం. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కోసం తీసుకువెళ్లేందుకు ఎనిమిది నెలలు అమెరికాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. అక్కడ ఎక్కువగా డబ్బులు వెచ్చించారు. భారీగానే ఖర్చయిందట. ఆ ఖర్చుని కూడా దానయ్య భరించారట. అయితే మొత్తానికి ఆస్కార్ నామినేషన్ కి ఆర్ఆర్ వెళ్ళింది. దానయ్య ప్రస్తావించకపోవడానికి రాజమౌళి కూడా ఒక కారణమని ఆయన మాట్లాడకపోవడంతో వారిద్దరి మధ్య ఉన్న కలహాల కారణంగా దానయ్య పేరు ప్రస్తావించడం లేదని ఓ వాదన గట్టిగా వినిపిస్తోంది..
ఒకవేళ రేపు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచిన దానేక మాత్రం క్రెడిట్ ఎవరనే మాట కూడా వినిపిస్తోంది. కారణాలు ఏవైనాప్పటికీ మర్చిపోవడం ప్రశంసించదగ్గ అంశం కాదని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో దానయ్య ను మరిచిపోవడం రాజమౌళి తీరు సరైన కాదని కొందరి వాదన. ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కూడా వాటిని మర్చిపోయి ముందుకు వెళ్లాలని అంత అనుకుంటున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టెన్షన్ పడి దానయ్య అనారోగ్యానికి కూడా అయ్యారు. అయినా కానీ ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోతుందని అందరి వాదన.