Mahesh Babu : టాలీవుడ్ లో ఒకప్పుడు సంగీతంతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు ఆర్పి పట్నాయక్ ఒకప్పుడు వరుస సినిమాలకి సంగీతం అందిస్తూ అందరికీ చేరువయ్యాడు. ఇప్పుడైతే కొత్తగా సంగీతాన్ని అందించేవారు ఉన్నారు .కాబట్టి ఈయనకి డిమాండ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు యంగ్ హీరో సినిమా అయినా ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ ఉండాల్సిందే
ఇక ఆర్పి పట్నాయక్ బోలెడన్ని సినిమాలలో సంగీతాన్ని అందించి గుర్తింపు సంపాదించుకున్నాడు. మనసంతా నువ్వే, నిజం, జయం, దిల్ ,సంతోషం ఇలా ఒక్కటేమిటి సూపర్ హిట్ మ్యూజికల్ హిట్స్ ఎన్నో అందించారు. ఇక ఇప్పుడైతే ఆర్పి పట్నాయక్ అప్పుడప్పుడు ఫంక్షన్లకు ఈవెంట్లకు ఇంటర్వ్యూలో కనిపిస్తుంటారు. అయితే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు తన జీవితంలో రీ గ్రేట్ అయిన సందర్భాలు చాలా తక్కువ అసలు లేవనే చెప్పాలి… అయితే మహేష్ బాబు నిజం సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసినందుకు ఆర్పి పట్నాయక్ బాధపడుతున్నాడట ఎందుకంటే అనుకోని పరిస్థితుల వల్ల సింగర్ ఉషా తో కలిసి తాను ఎక్కువ పాటలను పాడారన్నారు.
ఎందుకంటే తన వాయిస్ మహేష్ బాబు కి నచ్చలేదట తన వాయిస్ పిల్లాడి గొంతులా ఉంటుంది .కానీ స్టార్ హీరో కోసం పాడే వాయిస్ ల కనిపించలేదట మహేష్ కి అని ఆర్ పి చెప్పుకొచ్చారు. అందుకే ఆ సినిమాకు ఆర్పి పాటలు పాడాల్సింది కాదు అని అనుకున్నారట అంతేకాకుండా ఆయన కి ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పారట అంతేకాదు చాన్స్ ఉంది కదా అని ఎలా పడితే అలా పాడేస్తావా అని ముఖం మీదే అడిగేవారని ఆర్పి చెప్పారు.