Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 సీజన్ విన్నర్ నేనే అని ఎగురుతోన్న రేవంత్ కి దిమ్మతిరిగే దెబ్బ !

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 మొదలైనప్పటి నుంచి ఈ టైటిల్ నాదే.. మీరంతా పక్కకు వెళ్లి ఆడుకోండి అంటున్నాడు రేవంత్. మనోడిలో కాన్ఫిడెన్స్ ఆ రేంజ్‌లో ఉంది. అయితే కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం మంచిది కాదనే రేవంత్‌కు నాగార్జున కూడా వార్నింగులు ఇస్తున్నాడు. అయినా కూడా ఈయనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. గేమ్ బాగానే ఆడుతున్నా.. మనోడిలో ఉన్న కొన్ని అతి లక్షణాలు ఓట్ల విషయంలో తేడా వచ్చేలా చేస్తున్నాయి. నామినేషన్స్‌లో ఉన్న ప్రతీసారి సేవ్ అవుతున్నాడు కానీ రేవంత్‌కు పోటీగా మరో ఇద్దరు కూడా ఇంట్లో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరి నుంచి కచ్చితంగా రేవంత్‌కు చివరి వరకు పోటీ తప్పేలా లేదు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ముందుగా అనుకునేది..

వీలైనన్ని ఎక్కువ రోజులు అక్కడ ఉండాలి.. తనకు బాగా గుర్తింపు రావాలి.. దాంతో పాటు డబ్బులు కూడా బాగా రావాలని కోరుకుంటారు. ఈ సారి కూడా కంటెస్టెంట్స్ అంతా అదే చేస్తున్నారు. వచ్చిన ప్రతీ ఒక్కరు పేరుతో పాటు డబ్బులు కూడా కావాలంటున్నారు. అయితే రేవంత్ మాత్రం తనకు టైటిల్ కావాలంటున్నాడు. డబ్బులు గిబ్బులు తర్వాత.. ముందు టైటిల్ నేనే కొడతా చూడండి అంటున్నాడు. అందుకే ఇంట్లో ఎవరెన్ని అన్నా కూడా తనను తను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే రేవంత్‌లో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్.. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం.. ఓవర్ కాన్ఫిడెన్స్. అదే అతడి కొంప ముంచేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో రేవంత్‌కు పోటీగా శ్రీహాన్ ఉన్నాడు. మనోడు చాలా సైలెంట్.. అనవసరపు విషయాల్లో వేలు పెట్టడు.. తన వరకు వస్తే వదిలి పెట్టడు.. ఓ గేమర్‌కు ఉండాల్సిన లక్షణం ఇదే అంటున్నారు.

revanth to be the Bigg Boss 6 Telugu winner

Bigg Boss 6 Telugu : రేవంత్‌కు పోటీ ఇచ్చేదెవరంటే..?

అందుకే ఓట్ల విషయంలో రేవంత్‌కు ప్రతీసారి పోటీ ఇస్తున్నాడు శ్రీహాన్. గీతూ సైతం గేమ్ బాగానే ఆడుతున్నా.. ఈ పిల్లకు నోరే శాపం. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి తన గేమ్ తానే నాశనం చేసుకుంటుంది. రివ్యూవర్ ఆదిరెడ్డి మాత్రం గేమ్‌లో రచ్చ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈయన గురించి చర్చ బాగానే జరుగుతుంది. ఈయన ఆటతీరు చూస్తుంటే తప్పకుండా టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా నిలుస్తాడని చెప్తున్నారంతా. అంతేకాదు ఓటింగ్ విషయంలోనూ రేవంత్, శ్రీహాన్‌కు పోటీగా వస్తున్నాడు. కేవలం యూట్యూబ్‌లో రివ్యూలు చెప్పుకొనే వాడు వచ్చి ఏకంగా నెంబర్ 1 కంటెస్టెంట్‌గా ఉన్న రేవంత్‌కు పోటీ ఇస్తే అంతకంటే అద్బుతం మరోటి ఉండదు. ఇప్పుడిదే జరుగుతుంది. మరి చివరి వరకు అలాగే ఉంటే మాత్రం విన్నర్ నేనే అని ఎగురుతున్న రేవంత్‌కు పెద్ద షాకే అవుతుంది

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.