Ravanasura Movie : రవితేజ తెలుగు సినిమా నటుడు అంచలంచెలుగా ఎదిగి మాస్ మహారాజుగా ప్రేక్షకులకు పట్ల మంచి అభిమానం తెచ్చుకున్న “భూపతి రాజు రవిశంకర్ రాజు” అయిన మన స్టార్ హీరో రవితేజ. ఇతను సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందే ఉత్తర భారత దేశంలో జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్, మొదలైన ప్రదేశాలన్నీ కూడా తిరిగాడు. తర్వాత కుటుంబంతో సహా విజయవాడకు వెళ్లారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బిఏ కోర్సులో చేరాడు.ఆ తర్వాత సినీ ఇండ్రసిలో అడుగు పెట్టి మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసిన గుర్తింపు రాలేదు.దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఆ తరువాత 1999లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా “నీకోసం” అనే సినిమాలో రవితేజ హీరోగా నటించి పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డులు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు 2017లో రాజా ది గ్రేట్ తో మరొక విజయాన్ని అందుకున్నారు.
లాస్ట్ టైం ధమాకా మూవీతో మాస్, కమర్షియల్ అంశాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ధమాకా మూవీ సంతృప్తి పరుస్తుంది. కథ విషయాన్ని పక్కన పెడితే మంచి కంటెంట్తో పేర్చుకుంటూ పోయిన సీన్లు మాత్రం ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేవండోయ్ అంటూ..అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఆ తరువాత చిరంజీవితో కలసి వాల్తేరు వీరయ్య సినిమా చేసి సక్సెస్ కొట్టాడు.బాక్స్ ఆఫీస్ బడ్జెట్ బద్దల్కొట్టి వాళ్తేరు వీరయ్య మూవీ లో కూడా ఎంతగానో అభిమానులు అభినందనలు తెలిపారు.
అయితే ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తన తండ్రి తీసిన సినిమాలు చూడడానికి రవితేజ కూతురు స్వయంగా థియేటర్ కు వచ్చింది. అంతేకాకుండా థియేటర్ వద్ద రవితేజ కూతురు చేసిన సందడి మామూలుగా లేదు. చాలా హడావిడి గా వుంది అంటూ..అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.