Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఇటీవలి కాలంలో చేసే సందడి మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తుంది. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పుష్ప మూవీ ద్వారా పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మందన్నా . ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతోంది ఈ కన్నడ బ్యూటీ. త్వరలోనే బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై సినిమా అక్టోబర్ 7న ఆడియన్స్ ముందుకు రానుంది. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ అనే మూవీకి కూడా సైన్ చేసింది.
త్వరలో అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇవ్వనుంది ఈ అందాల భామ. ఇలా బిజీగా బిజీగా గడుపుతుంది. రష్మిక మందనికి ప్రముఖ డాక్టర్ సమక్షంలో చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగింది. రష్మిక మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతూ తాజాగా డాక్టర్ గురవారెడ్డిని సంప్రదించింది. ఆయన సోషల్ మీడియా పోస్ట్ బట్టి చూస్తే రష్మికకి వచ్చిన సమస్య అంత సీరియస్ కాదని అర్థం అవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘నువ్వు సామీ సామీ అంటూ మోకాళ్లపై బరువంతా వేసి డ్యాన్స్ చేయడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి’ అని మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చిన శ్రీవల్లితో ఇలా సరదాగా అన్నాను పుష్ప సినిమా చూసినప్పటి నుంచి ఆమెని అభినందించాలి అని అనుకున్నా.
Rashmika Mandanna : ఏమైంది..
ఆమె మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకి రావడంతో సందర్భం వచ్చింది. బన్నీ కూడా త్వరలో షోల్డర్ పెయిన్ అంటూ వస్తాడేమో అని గురువారెడ్డి ఫన్నీ కామెంట్స్ చేశారు. చివరగా రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే దళపతి విజయ్ సరసన వారసుడు అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్`సినిమా చేస్తుంది రష్మిక. ఇవే కాకుండా అమితా బచ్చన్‌తో `గుడ్‌బై` సినిమా చేస్తుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` సినిమాలో నటించింది. అలాగే `ఆషిఖీ3`లోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఇటు టాలీవుడ్, కోలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో రష్మిక సృష్టిస్తున్న అరాచకం అయితే మామలుగా లేదనే చెప్పాలి.