Brahmastra Movie : బ్రహ్మాస్త్ర రికార్డ్స్ కి కేజిఎఫ్ 2 గల్లంతు.. బిక్కుబిక్కుమంటున్న RRR..!

Brahmastra Movie : రణబీర్ కపూర్ ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.. ఈ చిత్రాన్ని తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు.. పాన్ ఇండియా చిత్రంలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ సాలిడ్ టాక్ లో సొంతం చేసుకుంది.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది.. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్స్ ఎంత.!? ఏఏ రికార్డులను బ్రహ్మాస్త్ర బద్దలు కొట్టిందో ఇప్పుడు చూద్దాం..!

పురాణాలలో చెప్పబడిన బ్రహ్మాస్త్ర ఆయుధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.. ఈ సినిమా మొదటివారం ప్రపంచవ్యాప్తంగా 20025 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది.. ఈ సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసిన కేజిఎఫ్2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను బ్రహ్మాస్త్ర ఏమేరకు బీట్ చేసింది అంటే.. బ్రహ్మాస్త్ర తొలి వీకెండ్ లో కేజిఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టింది.
కేజిఎఫ్ టు మొదటివారం 193 కోట్లు వసూలు చేయగా బ్రహ్మాస్త్ర ఏకంగా 225 కోట్లు సాధించి బిగ్ మార్జిన్ తో కేజిఎఫ్2 ను బీట్ చేసింది..

Ranbir Kapoor Brahmastra movie best kgf 2 movie records
Ranbir Kapoor Brahmastra movie best kgf 2 movie records

అయితే బ్రహ్మాస్త్రం మాత్రం ఆర్ఆర్ఆర్ ను బీట్ చేయలేకపోయింది.. ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కేవలం మొదటి రోజే ఏకంగా 223 కోట్లు సాధించింది.. రణబీర్ కెరీర్లో బ్రహ్మాస్త్ర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటించారు. అమితాబచ్చన్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోజు నటించారు.

Advertisement