Rana naidu Review : వెంకటేష్ రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో నేటి మధ్యాహ్నం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సిరీస్ పై మంచి హైట్ క్రియేట్ అయింది. రానా వెంకటేష్ మొదటిసారి నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కథేంటి.. ఏ విధంగా ఈ సిరీస్ సాగుతోంది ..ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం..
అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ కు రీమేక్ గా రానా నాయుడు తెరకెక్కింది. కరణ్ అన్షుమన్ సూపర్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ అరుణ్ ఈ సిరీస్ ను నిర్మించారు. ఇందులో సుర్విన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ చోప్రా, సుచిత్ర పిళ్ళై తదితరులు కీలక పాత్రలు పోషించారు.
బాలీవుడ్ లో వచ్చే ఎలాంటి ప్రాబ్లం నైనా ఈజీగా సాల్వ్ చేస్తాడు రానా నాయుడు ( రానా). వాళ్ళని కాపాడటానికి రానా ఎంత రిస్క్ అయినా చేస్తాడు. కానీ రానా తండ్రి నాగానాయుడు (వెంకటేష్) ఎందుకు రానా కి సమస్యగా మరవలసి వచ్చింది. అసలు నాగానాయుడిని జైలుకు రానా ఎందుకు పంపించాడు. ఆ విషయం నాగ నాయుడుకి తెలిసిందా.. తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాలు తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.
ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం అస్సలు నచ్చదు అని చెప్పొచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా ఈ వెబ్ సిరీస్ చూస్తూ వెళ్తే మాత్రం చివరిగా మంచి వెబ్ సిరీస్ చూసాం అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రతి పాత్రను మనం దగ్గరగా పరిశీలిస్తూ ఆ పాత్రలో లీనం అవుతూ చూస్తే వెబ్ సిరీస్ అద్భుతంగా అనిపిస్తుంది. ఏదో చూసేసామా అన్నట్టుగా ఉంటే రెండు ఎపిసోడ్స్ వరకు అసలు స్టోరీనే అర్థం కాదు. కొన్ని కొన్ని పాత్రలు మధ్యలో ఎందుకు వస్తున్నాయో వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కాదు. కానీ క్లైమాక్స్ పరంగా మాత్రం వెబ్ సిరీస్ కి గుండెకాయ.
వెంకటేష్ ఎప్పటిలాగానే తన నటనతో అందరినీ మరోసారి ఆకట్టుకున్నాడు . వెంకటేష్ రానా మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ గా సాగే కథ క్లైమాక్స్ మాత్రం బాగుంటుంది. రానా అద్భుతంగా నటించారు. మిగతావారు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి హోప్స్ పెట్టుకోకుండా ఆ పాత్రలలో లీనమై చూస్తే మాత్రం వెబ్ సిరీస్ చూడాలనిపిస్తుంది.