Samantha: టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా ఫుల్ పాపులారిటీ అయిన జోడీ ఎవరంటే నాగ చైతన్య సమంత జంట అని తప్పక గుర్తొస్తారు. అయితే విధిరాత అనుకోవాలో లేక వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలో తెలియదు గానీ నాలుగేళ్ల ఈ వివాహ బంధానికి ఉన్నట్టుండి బ్రేక్ వేశారు. స్టార్ హీరోయిన్గా అక్కినేని వారింట అడుగుపెట్టిన సమంత.. ఆ ట్యాగ్ చెరిపేసుకొని నాగ చైతన్యతో భార్యగా కాకుండా స్నేహితురాలిగా మాత్రమే ఉంటానని ఏడాది క్రితం తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మరోవైపు నాగ చైతన్య కూడా సరిగ్గా ఇదే సందేశం ఇచ్చి అక్కినేని అభిమానులను తెగ హర్ట్ చేసేశాడు. ఎంతో అన్యోన్యంగా, అంతకుమించి చూడముచ్చటగా ఉండే చై- సామ్ జోడీ విడిపోవడం ఎందరో అభిమానుల గుండెలను గుచ్చేసింది.
విడాకుల ప్రకటనకి కొన్ని నెలల క్రితం నుంచే తాము విడిపోతున్నట్టుగా సమంత హింట్స్ ఇచ్చంది. సోషల్ మీడియాలో ఆమె పేరు నుంచి అక్కినేనిని సమంత తొలగించడంతో అందరిలో అనుమానాలు తలెత్తాయి. చివరికి అదే నిజం అయింది. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతోనే విడిపోవాలని సమంత, చైతన్య నిర్ణయం తీసుకన్నట్టుగా సినీ వర్గాలు నుంచి సమాచారం అందింది. అయతే వారి మధ్య ఏర్పడిన విబేధాలు తారాస్థాయికి చేరడంతో.. ఇకపై కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చినట్టు కొందరు చెప్పుకొచ్చారు.
త్వరలోనే సిటాడల్ వెబ్ సిరీస్ , శాకుంతలం , ఖుషి సినిమాలతో మన ముందుకు రాబోతున్న సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. అన్ స్టాపబుల్ 2 షో కి గెస్ట్ గా వచ్చిన ఈయన ఇండస్ట్రీలో ఈతరం మహానటి ఎవరు అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సమంత పేరు చెప్పేశారు. సమంత ఫ్యాన్స్ ఈ మాటలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్న నేపథ్యంలో నాగచైతన్య పై ట్రోల్ చేస్తున్నారు. విడాకుల విషయంలో సమంత తప్పేమి లేదని, అంతా నాగ చైతన్యనే చేసి ఉంటాడని అందుకే సురేష్ బాబు.. సమంత గురించి గొప్పగా చెప్పాడంటూ ప్రచారాలు నడుస్తున్నాయి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.