Chiranjeevi : చిరంజీవి అభినందనలు కోసం ఎదురుచూస్తున్న శాస్త్రి..!!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్.. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది.. ఈ సినిమాకి రామజోగయ్య శాస్త్రి కొన్ని పాటలు రాశారు.. వాటికి తమన్ సంగీతం సమకూర్చారు.. తాజాగా ఈ సినిమాలో తను రాసిన పాటల గురించి రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ మెగా అభిమానులలో జోష్ నింపింది..! మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మ్యూజికల్ గా ముందే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఓ ఆనవాయితీగా వస్తోంది.. కంటెంట్ ఎలా ఉన్నా ముందుగానే సంగీతంతో శ్రోతల్ని అలరించగలగాలి..

ఆ తర్వాత జనాలు కంటెంట్ గురించి ఆలోచించే విధంగా చేయడం.. మెగాస్టార్ మొదటి నుంచి ఫాలో అవుతున్న స్ట్రాటజీ.. చిరు ఎనర్జిటిక్ స్టెప్పులతో సినిమాకి ముందే ఊపు తీసుకురావాలని.. ఎప్పటినుంచో ఫాలో అవుతున్న ఫార్ములా.. అందుకే చిరంజీవి సినిమాలకు పాటలు రాయాలన్న, డాన్స్ కంపోజ్ చేయాలన్న నిష్ణాతులై ఉండాలి టెక్నికల్గా సినిమాని జనాల్లోకి తీసుకు వెళ్లగలగాలి అదే చిరంజీవి మొదటినుంచి ఫాలో అయ్యే టెక్నిక్ ఇంకో 150 సినిమాలు చేసిన అందులో సంగీత ప్రియులకు కావాల్సిన ఎక్సైట్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది.. తాజాగా గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి సినిమాకి లిరిక్స్ రాసిన రామయ్య జోగయ్య శాస్త్రి.. ఇలాంటి ఎక్సైట్మెంట్ తోనే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది..

Ramajogayya sastry waiting for Chiranjeevi appreciation
Ramajogayya sastry waiting for Chiranjeevi appreciation

తమన్ తో తన అనుభూతిని రామ జోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో సంతృప్తిని కలిగించే పాటలు ఈ చిత్రానికి కుదిరాయి.. వాటికి తమన్ మంచి ట్యూన్స్ అందించారు.. రీ రికార్డింగ్, బీట్ సాంగ్స్ అన్నీ కుదిరాయి.. ఈ పాటలను మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు వింటారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న. అంత మంచి కంటెంట్ ఈ సినిమాకి కుదిరింది.. తమన్ సంగీతాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను.. అతనితో పని చేయటం నాకు ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది.. అని తమన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.. దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటే.. రామజోగయ్య ట్వీట్ మెగాస్టార్ అభిమానులలో మరింత క్యూరియాసిటీని పెంచింది.. ఇక మెగాస్టార్ ఎలాంటి ఫీడ్బ్యాక్ ను రామ జోగేశాస్త్రికి ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది..

Advertisement