Singer Sunitha : రెడ్ చీర లో సింగర్ సునీత .. ఏముంది రా బాబోయ్ .. రామ్ గారూ మీరు సూపర్ లక్కీ అండి!

Singer Sunitha : మహిళలు చాలామంది అందానికే అసూయ పుట్టేలా తయారవుతూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలైతే అసలు చెప్పాల్సిన పనిలేదు. యువతను ఆకట్టుకునే విధంగా రకరకాల వస్త్రధారణతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా అందంగా రెడీ అవుతూ ఉంటారు. మరి సీనియర్ సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు పదుల వయసు దాటినా కూడా అంతే అందంతో.. శిల్పి చెక్కిన శిల్పంలా ఎంతో అందంగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి కట్టు బొట్టు అన్నీ కూడా యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి . అంతేకాదు ఇంత లేటు వయసులో కూడా అంత అందం ఎలా సాధ్యం అంటూ యువత కూడా ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
ram-very-lucky-singer-sunitha-mesmerizing-with-red-colour-saree
ram-very-lucky-singer-sunitha-mesmerizing-with-red-colour-saree

అలా యువతను సైతం కట్టిపడేసే అందంతో.. చూపరులను ఆకట్టుకుంటున్న వారిలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నా సరే ఇంకా పదహారణాల పడుచు పిల్లలా తన అందంతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత తాజాగా మరొక అద్భుతమైన ఫోటోలు షేర్ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా రెడ్ కలర్ శారీలో గోల్డెన్ కలర్ బ్లౌజ్ ధరించి మెడలో పూసల దండతో ఎంతో అందంగా ముస్తాబయింది సునీత. దీపాల కాంతుల వెలుగులకు ఆమె మేని ఛాయ మరింతగా మెరిసిపోతోంది. సునీతను ఇలా చూసిన తర్వాత యువత నోటి నుండి కవితల వర్షం కురుస్తోంది. ” రెడ్ చీరలో సింగర్ సునీతను చూసి.. ఏముంది రా బాబు..రామ్ గారూ మీరు సూపర్ లక్కీ అండి ” అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా సునీత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాకుండా యువత నుంచి లైక్ , షేర్లు వస్తున్నాయి. మొత్తానికైతే తన చీర కట్టుతో యువతను ఆకట్టుకుంటోంది సునీత. ఏది ఏమైనా సునీత అందానికి ఫిదా అవని వారు ఉండరేమో. ప్రస్తుతం సునీత కెరియర్ విషయానికి వస్తే ఒకపక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూనే మరొకవైపు సింగర్ గా కూడా తన సత్తా చాటుతోంది. అంతేకాదు ఇంకొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది సునీత.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Advertisement