Singer Sunitha : రామ్ గోపాల్ వర్మ కి మొహం మీదే డోర్ వేసిన సునీత .. ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లే న్యూస్ ఇది !

Singer Sunitha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో ఎవరైనా నటించారు అంటే కచ్చితంగా వారి ఫేమ్ ఒక్క రాత్రిలోనే మారిపోతుంది అని చెప్పవచ్చు. అంతలా ఎంతోమంది యువ హీరోయిన్లు కూడా ఈయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో అడల్ట్ చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ హీరోయిన్ల పూర్తి అందాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిలా వుండగా మరోవైపు సింగర్ సునీత గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా విధులు నిర్వహిస్తున్న సింగర్ సునీత ప్రస్తుతం ఒకవైపు భర్త, మరొకవైపు పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు హీరోయిన్గా అవకాశం వచ్చినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని మీడియాతో వెల్లడించారు సునీత.

Ram gopal Varma offers to Sunitha by heroine chance.. but Sunitha rejected.. why?

సునీత గులాబీ సినిమాలో సింగర్ గా అవకాశం వచ్చినప్పుడు .. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో.. అనే పాట పాడి మంచి సక్సెస్ అందుకుంది . గులాబీ సినిమాలోని పాట సక్సెస్ అయిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దర్శకత్వంలో స్కూల్ సినిమా చేస్తున్న సమయంలో అందులో హీరోయిన్గా అవకాశం సునీతకు ఇచ్చారట. అంతేకాదు ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పడానికి సునీత ఇంటికి వెళితే.. సునీత డైరెక్ట్ గా ఆయన ముఖం మీదే డోర్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికీ సునీత చాలా పద్ధతిగా.. కట్టుబొట్టుతో సాంప్రదాయ పద్ధతిలోనే ఉండడానికి ఇష్టపడుతుంది. అలాంటప్పుడు వర్మ డైరెక్షన్లో సినిమా అంటే భయపడిపోయిన సునీత ఇలా చేసింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది సునీత.. సునీత హీరోయిన్గా తప్పుకోవడంతో వర్మ డైరెక్షన్ లో వచ్చిన స్కూల్ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి నటించింది. అలా వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంది సునీత. హీరోయిన్ల అవకాశాన్ని అయితే వదులుకుంది కానీ ఆమెకు లక్షల్లో అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.