Inaya : సోహేల్ వద్దు ఇతన్ని చేస్కో .. ఇనాయ కి ఒక సంబంధం చూసిన రాం గోపాల్ వర్మ , ఆమె ఆన్సర్ విని బిత్తరపోయాడు !

Inaya: ఇనయా సుల్తానా.. బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. బిగ్ బాస్ సీజన్ 6 లో రామ్ గోపాల్ వర్మ బ్యూటీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. విజేతగా నిలవకపోయినా తన ఆటతీరు, ప్రవర్తనతో అభిమానుల మనసులు గెల్చుకుంది. అందుకే ఆమె షో నుంచి ఎలిమినేట్‌ అయినప్పుడు.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్‌ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఇనయ తన క్రష్ సోహైల్‌ ను కలిసింది..  రాంగోపాల్ వర్మ వినయకు ఓ మంచి సంబంధం చూశారట.. ఇక అదే విషయం రాంగోపాల్ వర్మ ఇనయ తో చెప్పగా ఒకే ఒక్క మాట అనిందట అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Ram Gopal Varma choose a match for Inaya no to Sohel
Ram Gopal Varma choose a match for Inaya no to Sohel

ఇనాయ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే..  తన క్రష్ సోహేల్ ను కలిసి తన  మనసులో ప్రేమను బయట పెడుతూ.. ఓ వీడియో షేర్ చేయగా అది కాస్త   వైరల్‌ అయ్యింది.  ఇనయా రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహైల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్‌ చేసింది.

 

ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని సొహైల్‌ పై ప్రేమను కురిపించింది అమ్మడు.. అయితే ఇనయ ప్రేమను  సొహైల్‌ మాత్రం కాస్త కేరింగ్ అనే ఉన్నాడని టాక్ అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు..

 

ఇనయకు రామ్ గోపాల్ వర్మ ఓ మంచి సంబంధం చూశారట.. ఈ అబ్బాయిని నువ్వు చేసుకుంటే జీవితంలో సంతోషంగా ఉంటావని.. ఆర్థికంగా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని రామ్ గోపాల్ వర్మ ఇనయకు చెప్పారట. సోహెల్ వద్దు ఇతనే పెళ్లి చేసుకోమని చెప్పారట.. అయితే ఇనయ మాత్రం నేను నిజంగానే తనని ఇష్టపడుతున్నాను. అవి వీడియో వరకు చేసిన మాటలు కాదు. ఒకవేళ మీరు చూపించిన వాళ్ళనే పెళ్లి చేసుకున్న కూడా నా మనసులో సోహెల్ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని ఇనయ రామ్ గోపాల్ తో డైరెక్ట్ గా చెప్పేసిందట..